ఒకప్పుడు బంపర్ హిట్లతో ఇండస్ట్రీని ఏలినా ఇప్పుడు మాత్రం బ్యాడ్ టైమ్‌ తో టఫ్‌ ఫైట్ చేస్తున్నాడు మెగాస్టార్‌ చిరు. సరిగ్గా ఇదే టైమ్‌ లో నందమూరి నటసింహం బాలయ్య తన జోరును రోజుకింతలా పెంచుకుంటూ పోతూ సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తున్నాడు.
బోయపాటి డైరెక్షన్లో నటించిన అఖండ గతేడాది గ్రాండ్ గా రిలీజై బాక్సాఫీస్‌ ను భారీగా షేక్ చేయడంతో పాటు ఫ్యాన్స్‌ కి ఎడ్రినలిన్ రష్‌ నిచ్చింది.

అఘోరా గెటప్ తో ఆడియెన్స్‌ చేత థియేటర్ల

దగ్గర మాస్‌ జాతర చేయించిందా చిత్రం. ఇక లేటెస్ట్ గా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో చెన్నకేశవ రెడ్డి మూవీ కూడా రిలీజైంది. ఇరవై ఏళ్లయినా ఇప్పటికీ థియేటర్లో ఫ్యాన్స్‌ సందడి గానీ బాలయ్య మానియా గానీ ఏమాత్రం తగ్గలేదని మరోసారి ప్రూవయింది. విడుదలైన స్క్రీన్స్‌ నెంబర్లోనే కాదు.. కలెక్షన్స్‌ లోనూ యూఎస్ లోనూ ఆల్ టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది.

ఓవైపు బాలక్రిష్ణ ఈ ఏజ్‌ లో కూడా యంగ్ హీరోలకి పోటీనిస్తూ హిట్స్‌ తో దూసుకు పోతుంటే, మరోవైపు చిరంజీవి మాత్రం ఎన్నడూ ఊహించని రీతిలో డౌన్ ఫాల్ లో ఉన్నాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఆచార్య ఘోరంగా డిజాస్టర్ పాలైంది. చరణ్‌ తో కలిసి నటిస్తే ఫ్యాన్స్‌ కి పూనకాలే అనుకున్నాడు. కానీ కలెక్షన్స్‌ చూశాక డిస్ట్రిబ్యూటర్లకి వణుకొచ్చింది. సినిమా పాదఘట్టానికి పార్సిల్ అంటూ ఘోరంగా ట్రోల్స్‌, మీమ్స్‌ కూడా పడ్డాయి. అంతలా నెగిటివ్ టాక్ దక్కించుకుందా చిత్రం.

సినిమా పోయినా సరే, కనీసం రీ రిలీజుల ట్రెండ్ జోరుగా నడుస్తుంది కదా. అలా అయినా ఫ్యాన్స్‌ కి జోష్‌ తెప్పిద్దాం అనుకుని
‘ఘరానా మొగుడు’ మూవీని రీ రిలీజ్ చేస్తే.. ఆ చిత్రం కూడా పెద్దగా ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేయలేక పోయింది. మిగతా హీరోల రీ రిలీజులతో పోలిస్తే అంత సెన్సేషన్‌ కాలేకపోయింది. సో.. ఆ రకంగా కూడా ఒకప్పటి ఇండస్ట్రీ హిట్ తో కూడా ఇప్పుడు సక్సెస్‌ టాక్ సాధించలేకపోయాడు మెగాస్టార్‌. ఇలా ప్రస్తుతం చిరు బ్యాడ్ ఫేజ్‌, బాలయ్య సక్సెస్ స్ట్రీక్ ఒకే టైమ్‌ లో కంటిన్యూ అవుతున్నాయి.

తొంభై దశకం నుంచి మిలీనియమ్ తర్వాత కూడా చిరు, బాలయ్య సినిమాల మధ్య విపరీతమైన పోటీ ఉండేది. హండ్రెడ్ డేస్, సెంటర్స్‌, ఫస్ట్ డే కలెక్షన్స్‌, ఓవరాల్ వసూళ్లంటూ ఫ్యాన్స్‌ మధ్య ఫైట్స్‌ జరిగేవి. ఆ తర్వాత చిరంజీవి పాలిటిక్స్‌ లోకి ఎంట్రీ ఇవ్వడం, బాలక్రిష్ణ సినిమాల పరంగా డీలా పడడం జరిగాయి. మళ్లీ కొన్నాళ్లు ఇద్దరూ ఫుల్‌ ఫామ్‌ లో కొచ్చి వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్‌ దగ్గర సందడి చేస్తున్నారు. కానీ ఎంత కాదనుకున్నా గానీ బాలయ్య మాత్రం తనదైన జోష్ తో హిట్స్‌ కొడుతూ ‘అన్ స్టాపబుల్’ అంటూ దూసుకుపోతుంటే,

చిరు మాత్రం ఇలా ఫ్లాప్స్‌ తో, బ్యాడ్ ఫేజ్‌ తో డల్లవుతూ వస్తున్నాడు. మరి ఈ దసరా బరిలో నిలవనున్న గాడ్ ఫాదర్‌ తో అయినా మెగాస్టార్‌ ఫేట్‌ మారుతుందా? ఫామ్‌ లో కొచ్చి బాస్‌ ఈజ్ బ్యాక్‌ అనిపిస్తాడా అనేది తెలియాలంటే అక్టోబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే

మరింత సమాచారం తెలుసుకోండి: