ఇక వరుస అవకాశాలతో బిజీగా రాణిస్తున్న నాగశౌర్య చేసిన సినిమాలలో ఊహలు గుసగుసలాడే, కళ్యాణ వైభోగమే, ఛలో, అశ్వథామ, వరుడు కావలెను, లక్ష్యం సినిమాలు చెప్పుకోదగినవి. ఇక నాగశౌర్య ఎక్కడికి వెళ్లినా, ఏ సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న అతనికి ఎదురయ్యే ఒకే ఒక ప్రశ్న.
అతని పెళ్లి గురించే, చాలామంది పెళ్లి వయసు వచ్చింది కదా ఎప్పుడు శుభవార్త చెప్తారంటూ అడుగుతూ ఉండడంతో ఫైనల్ గా సమాధానం ఇచ్చేశాడు. అదేమిటంటే ఈ సంవత్సరం అయిపోయేలోపు కచ్చితంగా వివాహం చేసుకుంటానని తెలపడం జరిగింది.
నాగశౌర్య తల్లి దగ్గరి బంధువులలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఆ అమ్మాయి చాలా రిచ్ అంటా అనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక ఆ అమ్మాయి ఎవరు అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక మొత్తానికి నాగశౌర్య పెళ్లి పీటలు ఎక్కుతు న్నానని ఫాన్స్ లో ఆనందం నెలకొంది.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారి తెగ వైరల్ అయిపోయింది. దీనిపై ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ పెడుతున్నారు. ఇక మొత్తానికి మన హీరో బ్యాచిలర్ లైఫ్ పుల్ స్టాప్ పెట్టి వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ 2022 సంవత్సరం లో మూడు సినిమాలలో నాగశౌర్య నటిస్తున్నట్లు తెలుస్తుంది. అవి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, నారీ నారీ నడుమ మురారీ, పోలీస్ వారి హెచ్చరిక చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు సమాచారం.