అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి బాగా ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మల్లి నేను దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. క్రాక్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలకృష్ణ కోసం ఒక పవర్ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వేగంగా జరుపుకుంటోంది. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ కూడా నటిస్తున్నది. ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు , టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.



అయితే ఈ సినిమా టైటిల్ లో పలు రకాలుగా పేర్లు వినిపిస్తున్న ఈ సినిమా టైటిల్ను దసరా పండుగ సందర్భంగా రిలీవ్ చేయనన్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా బాలయ్య నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య మరో టాలెంటెడ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బాబీతో బాలకృష్ణ సినిమా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.



ఇక ఈ చిత్రంలో హీరో రవితేజ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వేగంగా జరుపుకుంటోంది. చిరంజీవి సినిమా తర్వాత బాలకృష్ణ సినిమా చేయబోతున్నట్లు బాబి సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక లైన్ కథను కూడా వినిపించారని అది బాలకృష్ణకు నచ్చడంతో ఓకే చెప్పినట్లుగా కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక గతంలో బాబీ ఎన్టీఆర్ తో కలిసి జై లవకుశ సినిమానీ తెరకెక్కించారు. మరి ఇప్పుడు బాలయ్యతో సినిమా అంటే అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ విషయంపై అధికారికంగా రావాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: