సంక్రాంతి పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాల సందడి మొదలవుతు ఉంటుంది.  ఇది ఇలా ఉంటే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ కూడా ఇలాంటి వాతావరణమే కనపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సంక్రాంతి కి తమ సినిమాలను విడుదల చేయనున్నట్లు కొంత మంది స్టార్ హీరోలు ప్రకటించారు. ఆ సినిమాలు ఏమిటో తెలుసుకుందాం.
 
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో పెనకెక్కుతున్న ఒక మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటి వరకు అధికారికంగా టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ చిరంజీవి కెరియర్ లో 154వ సినిమాగా తేరకేక్కుతుండడంతో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఈ మూవీ లో శృతి హాసన్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.  ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించింది.


తమిళ సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న దళపతి విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

 
ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌతు దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ మూవీ ని కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇలా ఇప్పటికే ఈ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడడానికి రెడీ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: