బాలీవుడ్ లో నటుడుగా పేరుపొందారు అనుపమ్ ఖేర్. తాజాగా క్రీడాకారిని పివి సింధును కలవడం జరిగింది. హైదరాబాదులో ఉన్న సింధు నివాసానికి వెళ్లి ఆమెను ప్రశంసించడం జరిగింది అనంతరం అందుకు సంబంధించిన కొన్ని విశేషాలను తన ట్విట్టర్ ద్వారా పంచుకుంది సింధు. ఇక నటుడు అనుపమ్ ఖేర్ తో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటో, వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక సింధు ఇంట్లో ఉన్న ట్రోఫీలు , మెడల్స్ అన్నిటిని మనం చూడవచ్చు.


నిజానికి ఇది చాలా అద్భుతం.  ఇటీవల తాను బ్యాడ్మింటన్ పీవీ సింధును కలవడానికి ఆమె ఇంటికి వెళ్లడం తనకు చాలా బాగా నచ్చింది అని తెలియజేసింది. 8 ఏళ్ల వయసు నుంచి ఆమె సాధించిన విజయాలు అవార్డులను సైతం,  ట్రోపీల గురించి ఆమెను అడిగి తెలుసుకున్నానని. ఆమె వినయానికి నేను కూడా మంత్రముగ్ధుల్ని అయ్యానని తెలియజేశారు అనుపమ్ ఖేర్. ఆమె మనకు స్ఫూర్తిని ఇచ్చే నిజమైన హీరో అని తెలియజేశారు నటుడు. ఇక మరొక సందర్భంలో సింధు సంపాదించిన ట్రోఫీలను చూపిస్తూ ఆమె వన్ అండ్ ఓన్లీ ఛాంపియన్ అంటూ ఆ అవార్డులను చూసి నేను కూడా గర్వపడే వాడినని తెలియజేశారు.


ఇక సింధు సైతం తన ఇంస్టాగ్రామ్ లో అనుపమ్ తో సమావేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైం గ్రేట్ యాక్టర్ గా పేరు పొందారు అనుపమ్ ఖేర్ ఈ తనని కలవడం తన అదృష్టంగా తెలియజేసింది. ఇక ఇటీవల నిఖిల్ నటించిన కార్తికేయ -2 చిత్రంలో కూడా కీలకమైన పాత్రలో నటించారు. ఈ నటుడు ఇప్పుడు రవితేజ హీరోగా తెరకెక్కిస్తున్న టైగర్ నాగేశ్వరరావు లో కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ నటుడు సంబంధించి షూటింగ్ కూడా ఇటీవలే పూర్తి చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: