స్టార్ హీరోయిన్ సమంత నటించిన రెండు చిత్రాలలో శాకుంతలం, యశోద సినిమాలు తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో మంచి పాపులారిటీ సంపాదించాయి. ఈ చిత్రాలన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు యశోద సినిమాను హిందీ సినిమా అన్నట్లుగా ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సినీ వర్గాలలో ఈ విషయం కాస్త చర్చనీయంశంగా మారిందని చెప్పవచ్చు. యశోద గురించి ఇప్పటివరకు తెలుగులో ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పెద్దగా చేయలేదు చిత్ర బృందం.


అయితే ఈ సినిమా విడుదల తేదీని కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ యశోద ప్రమోషన్స్ ఉత్తర భారత దేశంలో బాగా నడుస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పలు మల్టీప్లెక్స్ స్క్రీన్ లపై కూడా ఈ సినిమా టీజర్ ను అక్కడ విడుదల చేయడం ద్వారా ఇది హిందీ సినిమా అన్నట్లుగా అక్కడి వారు భావిస్తున్నట్లుగా సమాచారం. సమంతకి ఇప్పటికే ఉత్తర భారత దేశంలో మంచి గుర్తింపు ఉన్నది కనుక యశోద సినిమాని హిందీలో ప్రమోట్ చేసి విడుదల చేస్తే మంచి లాభాలు వస్తాయని చిత్ర బృందం భావించి హిందీ సినిమా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం.


యశోద తో పాటు శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక యశోద సినిమా బాలీవుడ్ లో విడుదల చేసి మంచి విజయాన్ని అందుకుంటే శాకుంతలం సినిమా కూడా అక్కడ భారీ ఎత్తున విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. మొత్తానికి సమంత సినిమా టాలీవుడ్ కంటే నార్త్ పైన ఎక్కువగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సమంత అక్కడ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నది. ఇక ఇన్ని రోజులు తెలుగులో సినిమాలు సమంతవి అక్కడ డబ్ అయ్యి  విడుదలయ్యేటివట . మరి సమంత ఈ రెండు చిత్రాలతో విజయం అందుకుంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: