డైరెక్టర్ మణిరత్నం డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. ఈ చిత్రం సెప్టెంబర్ 30వ తేదీన భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల అయింది. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్, త్రిష ,జయం రవి, కార్తీక్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు ఇక ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై తమిళనాడులో కేవలం ఒక్క రోజులోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా పేరు సంపాదించింది కానీ ఇతర భాషలలో మాత్రం ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా పైన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


చిరంజీవి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించిన విషయం అందరికీ తెలిసింది.అయితే ఈ సినిమా వాయిస్ ఓవర్ కూడా ఫర్ఫెక్ట్ గా లేదని ఏం చెప్పారో ఎవరికి అర్థం కాలేదని ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందించడంలో విఫలమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని నటీనటులను పరిచయం చేస్తే గందరగోళంగా ఉండేది కాదని ఒక నిటిజన్ కామెంట్ చేయడం జరిగింది. మరొక నేటిజన్ ఏకంగా  కథ కథనాల పైన గాటుగా స్పందించడం జరిగింది. నేను నవల చదివిన అయితే నేను ఆశించిన స్థాయిలో ఈ చిత్రం లేదని కూడా తెలియజేస్తున్నారు


ఎవరు ఊహించని నటుడిని టైటిల్ పాత్రకు మణిరత్నం ఎంచుకోవడాన్ని తప్పు పట్టారు తమిళ ప్రేక్షకులు. పొన్ని యన్ సెల్వన్ రాజరాజ చోళని అగ్రరాజుగా ఊహించుకున్నామని కానీ అలాంటి పాత్రకు అగ్ర నటుడిని తీసుకుంటారు అంటే జయం రవిని తీసుకురావడం తమకు నచ్చలేదని కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం మణిరత్నం శైలి ఈ సినిమాకు ప్రతి బీటు కూడా బాగా నచ్చిందని తెలియజేస్తున్నారు. కొంతమంది ఈ సినిమాకు యావరేజ్ రివ్యూలు ఇవ్వడం చాలా బాధ వేస్తోంది అని మణిరత్నం అభిమానులు కూడా తెలియజేస్తున్నారు. ఇలా పలు రకాలుగా కామెంట్ చేస్తూనే ఉన్నారు ఆడియన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: