నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తను నటించే సినిమాలు హీట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా చేసుకుంటూ వెళ్తున్నారు. చివరిగా నాని నటించిన అంటే సుందరానికి సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పిచలేకపోయింది. ఈసారి కచ్చితంగా ఒక మాస్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు ఆ చిత్రమే దసరా. ఈ చిత్రాన్ని నటుడు శ్రీకాంత్ వదల దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా పైనే ఆశలన్నీ హీరో నాని అభిమానులు కూడా పెట్టుకున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నది.


తాజాగా మేకర్ ఫస్ట్ సింగిల్ గురించి అప్డేట్ ఇవ్వడం కూడా జరిగింది. ధూమ్ ధామ్ దోస్తావ్ అనే టైటిల్ పాటను ఈ రోజున విడుదల కాబోతున్నది. ఇదంతా ఇలా ఉంటే నాని తాజాగా ట్విట్టర్ ప్రొఫైల్ తో పాటు ప్రోమో ను కూడా లీక్ చేయడం జరిగింది. అయితే డైరెక్టర్ మాత్రం ఎలాంటి లీక్ చేయొద్దని చెప్పడంతో కేవలం బీట్ ను మాత్రమే లీక్ చేశారట నాని. ఈ ప్రోమోలో నాని చాలా అద్భుతమైన డాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో నాని ఊర మాస్ గెటప్పులు కనిపించడమే కాకుండా డాన్స్ తో కూడా సర్ప్రైజ్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు.


దసరా పండుగ అంటే ఇదే నాని దుమ్మురేపాడుగా అంటూ మరికొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ చిత్రంతో ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారని ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడతారని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయికుమార్ ,సముద్రఖని తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో వచ్చేయోడాది మార్చి 30వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ప్రస్తుతం నాని తన ట్విట్టర్ నుంచి షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: