బాలీవుడ్ క్యూట్  జంట కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీ జంట తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటారు.అయితే ఎక్కువగా సినిమాలకు సంబంధించిన వార్తలు నిలుస్తూ ఉంటారు, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ జంట ఒక విలాసవంతమైన కారును కొనుగోలు చేశారు.అయితే  అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.కాగా  సైఫ్ అలీ ఖాన్ జంట ఖరీదైన వైట్ మెర్సిడెస్ బెంజ్‌ను సొంతం చేసుకున్నారు.

ఇక అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడంతో అభిమానులు ఆ కారు ధర ఎంత ఉంటుందా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈ కారు ధర విని అభిమానులు ఆశ్చర్యపోయారు. కాగా ఈ బెంజ్ కారు ధర రూ.2కోట్లు ఉంటుందని సమాచారం. ఇక ఈ కారు మోడల్ మెర్సిడెస్ యస్ 350 డీ అని తెలుస్తోందీ. ఇందుకు  సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.అయితే  ఆ వీడియోలలో కరీనా కపూర్ తన కొడుకు జహంగీర్ అలీ ఖాన్ ని ఎత్తుకొని ఆ కారుపై ఉన్న క్లాత్ ని తీసేసింది.

ఇక అనంతరం తన కొడుకుతో కలిసి అలా బయటికి వెళ్ళింది.  ఈ ఫోటోలను కరీనా కపూర్ అభిమానులు అందరు ఈ పిక్స్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు.  ఈ జంట క్రొద్ది రోజుల క్రితమే రూ.60లక్షల విలువ చేసే వ్రాంగ్లర్ కారును కొనుగోలు చేసారు.  సైఫ్ అలీ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే విక్రమ్ వేద సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. కాగా పాన్ ఇండియా లెవెల్లో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది.  విక్రమ్ వేద సినిమాలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రల్లో నటించిన విషయం తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: