అయితే ఈసారి కచ్చితంగా హిట్ సాధించాలని ఉద్దేశంతోనే యాక్షన్ త్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. గోపీచంద్, శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా వేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా యాక్షన్ త్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక డైరెక్టర్ శ్రీను వైట్ల కూ కూడా సక్సెస్ చాలా అవసరం.
ఈ ఇద్దరు కూడా సక్సెస్ సాధించాలనే కసితో ఉన్నారు. ఇక వీరిద్దరికి కూడా సక్సెస్ ప్రస్తుతం చాలా అవసరము. శ్రీనువైట్ల గతంలో వచ్చిన ఎన్నో చిత్రాలు భారీగాని విజయాన్ని అందుకున్నాయి కానీ ఈ మధ్యకాలంలో వరుసగా పలు ఫ్లాప్ లు చవిచూస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా అని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు చిత్ర బృందం. మరి ఈ సినిమాతో నైనా వీరిద్దరూ సక్సెస్ అవుతారేమో చూడాలి మరి. ఇక అంతే కాకుండా గోపీచంద్ సక్సెస్ కావడానికి విలన్ గా కూడా నటించడానికి సిద్ధమే అన్నట్లుగా గతంలో తెలియజేశారు. మరి ఈసారి హీరోగా లేదంటే విలన్ గా అయిన నటిస్తారేమో చూడాలి.