ఇద్దరు ఎనర్జిటిక్ డాన్సర్లు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ కిక్కు మరొక లాగా ఉంటుందని చెప్పవచ్చు ఇప్పుడు అలాంటి ఘటన తెలుగు ఇండస్ట్రీ లో తెలుగు ప్రేక్షకులకు లభించనుంది ఇంతకీ వారు ఎవరంటే హీరో రామ్ పోతినేని, హీరోయిన్ శ్రీ లీల. ఇక వీరిద్దరి ఎనర్జీటీకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ చిత్రంలో నటించేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్యాన్ని గతంలో ఎంపికైనట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు దర్శక నిర్మాతలు సైతం మనసు మార్చుకొని హీరో రామ్ సరసన డాన్సింగ్ క్విన్ ను హీరోయిన్ గా ఎంపిక చేయాలని భావనతో శ్రీలీలాను తీసుకున్నట్లు సమాచారం.


శ్రీలిలా నటించిన మొదటి చిత్రం పెళ్ళిసందడి ఈ సినిమాతో ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుతుంది. తన అందం అభినయం,ఎనర్జీతో ఎంతో అద్భుతమైన నటన ప్రదర్శించండి హీరో రవితేజ సరసన ధమాకా చిత్రంలో కూడా నటించడానికి అవకాశం సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్ లో కూడా ఈమె చాలా ఎనర్జిటిక్ గా నటించడం జరిగింది. దీంతో రామ్ ఎన్జీటీకి ఈ ముద్దుగుమ్మ కరెక్టుగా  భావించి చిత్ర బృందం ఈమెను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక నవీన్ పోలిశెట్టి సరసన జూనియర్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా ప్రకటన ఈనెల 5వ తేదీన వెలువబడునుంది. ఇక అంతే కాకుండా బాలకృష్ణ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఇక అందుకు తగ్గట్టుగా ఇమే బరువు తగ్గి మరింత స్లిమ్ముగా కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ కూతురి పాత్రలో ఈమె నటించబోతోంది. మరి హీరో రామ్ సరసన నటించే అవకాశం అధికారికంగా చిత్ర బృందం ప్రకటిస్తే బాగుంటుంది అని అభిమానులు కూడా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: