చిరంజీవి 'ఆచార్య' సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యి షెడ్డుకి పోయిన సంగతి అందరికీ తెలిసింది.ఆ సినిమా డిజాస్టర్ కావడానికి కొరటాలదే బాధ్యత అన్నట్లుగా చిరంజీవి మాట్లాడుతుండడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ విషయంలో ఇంతకుముందే ఒకట్రెండు సందర్భాల్లో పరోక్షంగా చిరు చేసిన వ్యాఖ్యలు చాలామందికి కూడా అసలు రుచించలేదు.తాజాగా ఫిల్మ్ కంపానియన్ ఇంటర్వ్యూలో.. ఆ సినిమా విషయంలో రిగ్రెట్ లేదని, ఎందుకంటే అది డైరెక్టర్ ఛాయిస్ అని, ఆయన చెప్పిందే తాము చేశామని అన్నాడు చిరు. హిట్టయితే క్రెడిట్ తీసుకుని, ఫ్లాప్ అయితే మాత్రం దర్శకుడి మీదికి తోసేస్తారా అంటూ చిరు మీద యాంటీ ఫ్యాన్స్ ఒక రేంజిలో విరుచుకుపడుతున్నారిప్పుడు.ఈ సందర్భంగా మహేష్ బాబు ఒక సందర్భంలో అన్న మాటలను గుర్తు చేస్తున్నారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే అందుకు ప్రధాన బాధ్యత తానే తీసుకుంటానని మహేష్ అన్నాడు అప్పుడు. అందుకు కారణమేంటో కూడా వివరించాడు. సినిమా కథను ఓకే చేసింది తనే కాబట్టి.. తాను నో చెప్పి ఉంటే ఆ సినిమా తెరకెక్కేదే కాదు కదా.. కాబట్టి తాను బాధ్యత వహించాల్సిందే అని మహేష్ తెలిపాడు. హిట్టయితే ఆ క్రెడిట్ అందరికీ దక్కుతుందని కూడా చెప్పాడు.


ఇక మరో సందర్భంలో మహేష్ గురించి దర్శక రత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. 'దూకుడు' సినిమా అంత పెద్ద హిట్టవడం పూర్తిగా శ్రీను వైట్ల క్రెడిటే అని, అతను చెప్పినట్లే తాను చేశానని మహేష్ తనతో అన్నాడని, అలాగే 'బిజినెస్ మేన్' విషయంలోనూ క్రెడిట్ అంతా పూరీ జగన్నాథ్‌కే ఇచ్చాడని.. ఇది మహేష్‌లో ఉన్న గొప్ప లక్షణం అని దాసరి కొనియాడిన వీడియోను కూడా నెటిజన్లు ఇప్పుడు షేర్ చేస్తూ మహేష్ ని తెగ పొగుడుతూ చిరును మాత్రం బండ బూతులు తిడుతున్నారు నెటిజన్స్.మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో చిరు బాగానే అన్ పాపులర్ అయ్యాడన్నది వాస్తవం. సినిమా హిట్టయితే తన ఇన్‌పుట్స్ గురించి, తన జడ్జిమెంట్ గురించి చెప్పుకునే చిరు.. ఫ్లాప్ అయితే అందుకు తన బాధ్యతేమీ లేదని, పూర్తిగా దర్శకుడిదే రెస్పాన్సిబిలిటీ అని మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్ అని, ఇకనైనా ఆయన మారాల్సిన అవసరం ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: