ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ దర్శకుడు త్రివిక్రమ్ ని తిడుతున్న ఆడియో కాల్ ఒకటి అప్పట్లో  చాలా బాగ వైరల్ అయ్యింది. అయితే ఆ వాయిస్ నాది కాదని, ఎవరో సృష్టించారని బండ్ల వివరణ ఇచ్చారు.

తాజాగా త్రివిక్రమ్ ని తిట్టిన మాట వాస్తవమే అని ఆయన ఒక ప్రెస్ మీట్ లో ఒప్పుకున్నారు.

 
ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ విడుదలైంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ జరగడానికి ముందు రోజు ఓ ఆడియో ఫైల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ ఆడియో కాల్ లో బండ్ల గణేష్ దర్శకుడు త్రివిక్రమ్ ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

 
త్రివిక్రమ్ గాడు నన్ను భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకుండా అడ్డుకుంటున్నాడు. నేను వస్తే వాడు డామినేట్ అవుతాడని ఆహ్వానం పంపలేదు. నేనైతే స్పీచ్ సిద్ధం చేసుకొని ఉన్నాను. పవన్ ఫ్యాన్స్ అందరూ బండ్లన్న బండ్లన్నా అంటూ నినాదాలు చేయడమే, పక్కన వేచి చూస్తున్న నేను వచ్చేస్తాను.. అని పవన్ అభిమానితో బండ్ల గణేష్ మాట్లాడారు.

 
లీకైన ఆడియో ఫైల్ లో ఉన్న మేటర్ ఇది. ఇక ఆడియో ఫీల్ ఉన్న వాయిస్ బండ్ల గణేష్ వాయిస్ కి చాలా దగ్గరగా ఉంది. అయితే బండ్ల ఆ వాయిస్ తనది కాదని ఖండించారు. ఎవరో నాపై పగతో ఫేక్ క్రియేట్ చేశారన్నారు. త్రివిక్రమ్ సైలెంట్ గా ఉన్న నేపథ్యంలో ఆ వివాదం అంతటితో ముగిసిపోయింది

 
అప్పుడు ఆడియో రికార్డులో ఉంది నా వాయిస్ కాదన్న బండ్ల తాజాగా ఫ్లేటు మార్చారు. అది నా వాయిస్సే, త్రివిక్రమ్ ని తిట్టిన మాట వాస్తవమే అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్.. ఏదో కోపంలో అప్పుడు త్రివిక్రమ్ ని నేను తిట్టాను. మనిషన్నాక కోపం వస్తుంది కదా... అలాగే నేను కూడా కోపంలో ఏదో ఒక మాటన్నాను.

 
తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ కి సారీ  కూడా చెప్పాను. ఆ వివాదం  ఇంకా ముగిసి పోయింది. అది చిన్న విషయం మమ్మల్ని దూరం చేయదు అన్నారు. అయితే వైరల్ అయిన ఆడియోలో ఉన్న పూర్తి వాయిస్ నాది కాదని ఆయన మరలా మాట మార్చడం విశేషం. ఏదైతేనేమి త్రివిక్రమ్ ని తిట్టినట్లు బండ్ల గణేష్ ఫైనల్ గా ఒప్పుకున్నారు.

 
కాగా త్రివిక్రమ్ ని తిట్టిన ఆడియో బయటికి వచ్చినప్పటి నుండి పవన్ ని బండ్ల కలవకపోవడం విశేషం. బండ్ల గణేష్ పై కోపంగా ఉన్న పవన్ ఆయన్ని దూరం పెట్టాడని మనకి తెలుస్తోంది . అప్పట్లో బండ్ల గణేష్ తరచుగా పవన్ ని కలిసేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: