టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు పొందిన శ్రీనువైట్ల కెరియర్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను తెరకెక్కించారు. కానీ ఇటీవల మాత్రం ఎక్కువగా డిజాస్టర్ మూవీలను చవిచూశారు. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారని వార్తలు కూడా వైరల్ గా మారాయి. ఇక తాజాగా దసరా పండుగ సందర్భంగా తన లైఫ్ లో ఒక కొత్త మలుపు గురించి తెలియజేయడం జరిగింది వాటి గురించి చూద్దాం.


టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా పేరుపొందిన గోపీచంద్ తో కలిసి తన సినిమాను ప్రారంభిస్తున్నానని శ్రీనువైట్ల సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇక గోపీచంద్ కూడా ఇటీవల వరుస ప్లాపులతో చాలా సతమతమవుతున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఒక కామెడీ మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గత కొన్ని రోజులుగా వైరల్ గా మారుతూనే ఉంది. కానీ ఈ విషయంపై డైరెక్టర్ స్వయంగా స్పందించడంతో గోపీచంద్ అభిమానులు కూడా ఈ విషయం నిజమేనని అభిప్రాయపడుతున్నారు.


శ్రీను వైట్ల, గోపీచంద్ కాంబినేషన్లో వస్తున్న సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి అభిమానులకు. ఇక గతంలో శ్రీను వైట్ల దూకుడు, వెంకీ, దుబాయ్ శీను ,రెడీ వంటి చిత్రాలను తెరకెక్కించారు. రచయిత  గోపి మోహన్ పనిచేశారు. ఇప్పుడు కూడా తాజాగా శ్రీనువైట్ల తో కలిసి మరొక సినిమాకి రచయితగా చేయబోతున్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా సక్సెస్ అయ్యింది. అందుచేతనే ఈ సినిమా పైన మరింత ఆసక్తి పెరిగిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నది చిత్ర బృందం. ఏది ఏమైనా ఇద్దరూ ఫ్లాప్ ల మధ్య సక్సెస్ సినిమాని అందుకుంటారేమో చూడాలి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం చాలా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: