తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. అయితే ఇప్పటికి ఎన్నో నెలలు కావస్తున్న తన తదుపరి చిత్రాన్ని మాత్రం ప్రకటించలేదు. మొదటిసారిగా కొత్త బంగారులోకం చిత్రంతో డైరెక్టర్ గా మారిన శ్రీకాంత్ అడ్డాల తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు ఆ తర్వాత మహేష్ బాబు వెంకటేష్ తో కలిసి జీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తెరకెక్కించి టాప్ డైరెక్టర్గా పేరుపొందారు. ఇక అప్పటినుంచి క్రేజీ డైరెక్టర్గా ఫ్యామిలీ డైరెక్టర్ గా కూడా పేర్కొన్నారు.



ఇక ఈ రెండు సక్సెస్ సినిమాల తర్వాత ముకుంద, బ్రహ్మోత్సవం వంటి సినిమాలు భారీ ఫ్లాప్ ని చూశాయి. దీంతో డైరెక్టర్ రేస్ లో కాస్త వేనకపడ్డారు. దీంతో గత సంవత్సరం వెంకటేష్ తో కలిసి నారప్ప సినిమాని రీమిక్స్ చేసి బాగానే ఆకట్టుకున్నారు. అయితే గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఒక పీరియాడికల్ డ్రామా చిత్రాన్ని చేస్తున్నానని గీత ఆర్ట్స్ బ్యానర్ పైన ఈ సినిమా ఉంటుందని శ్రీకాంత్ వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి విషయాన్ని తెలియజేయలేదు. ఇక డైరెక్టర్ ఒక మల్టీస్టార్ చేస్తున్నాడని వార్తలు కూడా బాగా వినిపిస్తూ ఉన్నాయి.


కానీ ఈ సినిమా ఇప్పటివరకు సెట్స్ మీదికి మాత్రం తీసుకు వెళ్ళలేదు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలంతా వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు. ఇక ఇప్పట్లో ఎవరి డేట్స్ కూడా దొరికే అవకాశం లేదని చెప్పవచ్చు అందుచేతనే శ్రీకాంత్ అద్దాల మల్టీ స్టార్ సినిమా కాస్త ఆలస్యం అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ మధ్య వెంకటేష్, రవితేజతో కలిసి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని వార్తలు బాగా వైరల్ గా మారాయి. మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ల నుంచి సినిమాలు రావడం అంటే కాస్త సమయం పడుతుందని సినీ ప్రేక్షకులు సైతం అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: