అంతేకాకుండా తన యాక్టింగ్ టైమింగ్ కూడా డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటాడు. అయితే ఈసారి పూర్తిస్థాయిలో విభిన్నంగా పాన్ ఇండియా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా నాని కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ అని సమాచారం. ఇక ఏ విధంగా ఆ రూట్లో నాని 100 కోట్ల మార్కెట్ను క్రియేట్ చేసుకుంటున్నాడు అనే వివరాల్లోకి వెళితే..
చివరి రెండు సినిమాలు
నాని నటించిన గత రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయాయి. శ్యామ్ సింగరాయ్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ స్థాయిలో ఏమీ లాభాలు అందించలేదు. ఇక తర్వాత వచ్చిన అంటే సుందరానికి సినిమా కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది కానీ కలెక్షన్స్ పరంగా సినిమా అయితే ఫెయిల్ అయింది.
ఊర మాస్
ఈసారి దసరా అనే సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలి అని నాని ఎదురు చూస్తున్నాడు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ముఖ్యంగా నానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తోనే ఒక్కసారిగా హైప్ పెరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా నాని ఊర మాస్ మాస్ లుక్కుతో కనిపించబోతున్నాడు. తెలంగాణలోని గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో.. దసరా సినిమాను రూపొందిస్తున్నారు.
భారీ బడ్జెట్ తో దసరాఇక ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదట ఈ సినిమా బడ్జెట్ పై అనేక రకాల కథనాలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా బడ్జెట్ భారీగా పెరిగిపోతూ ఉండడంతో నిర్మాత తప్పుకున్నట్లు కూడా టాక్ వచ్చింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని ఇటీవల ఇచ్చిన అప్డేట్ తో మరో క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ సినిమాకు మొత్తంగా 50 కోట్లకు పైగా బడ్జెట్ ఫిక్స్ అయినట్లు సమాచారం.
భారీగా బిజినెస్
అయితే ఈ సినిమా అందుకు తగ్గట్టుగా బిజినెస్ చేస్తుందో లేదో అనే అనుమానాలు వస్తున్న తరుణంలో ఇప్పటికే పెట్టిన పెట్టుబడిన వెనక్కి తీసుకువచ్చినట్లు కూడా మరొక కొత్త టాక్ వినిపిస్తోంది. దసరా సినిమా ఓటిటి హక్కులు దాదాపు 30 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. అలాగే వివిధ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు కాబట్టి మిగతా భాషల్లో ఈ సినిమా హక్కులు మరో 20 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక శాటిలైట్ పరంగా మరో 10 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందట. దీన్నిబట్టి ఈ సినిమా ఇక్కడే 60 కోట్ల వరకు బిజినెస్ చేసింది.
మొత్తం 100 కోట్లు?
నాన్ థియేట్రికల్ గా అయితే సినిమా అన్ని భాషల్లో కలుపుకొని దాదాపు మంచి బిజినెస్ చేయగా ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా థియేట్రికల్ గా దాదాపు 40 కోట్ల వరకు ప్రూ రిలీజ్ బిజినెస్ చేయవచ్చు అని తెలుస్తోంది. ఇలా చూసుకుంటే మొత్తంగా సినిమా 100 కోట్ల బిజినెస్ అయితే చేస్తోందట. ఇది కూడా నాని కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ రికార్డ్ సినిమా అవుతుంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటే మాత్రం నాని రేంజ్ మరో లెవెల్ కి వెళుతుంది అని చెప్పవచ్చు.