తమిళంలో స్టార్ హీరోగా పేరు పొందారు కార్తీ. ఈ హీరో నటించిన ఎక్కువ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. అలా యుగానికి ఒక్కడు , నా పేరు శివ, ఖాకీ, ఖైదీ ,ఆవారా తదితర సినిమాలు ఉన్నాయని చెప్పవచ్చు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఊపిరి చిత్రంతో తెలుగులో స్ట్రైట్ గా నటించారు కార్తీ. ఇక తన అన్న సూర్య కూడా వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. సూర్య చేసే ప్రతి సినిమా కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక ఇటీవలే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పోన్నియన్ సెల్వన్ చిత్రంలో కార్తీ నటించారు. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.


సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై మంచి రెస్పాన్స్ కూడా అందుకుంది ఇప్పుడు తాజాగా తను నటించిన మరొక సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అభిమన్యుడు డైరెక్టర్ పిఎస్ మిత్ర కాంబినేషన్లో వస్తున్న సినిమా సర్దార్. ఈ చిత్రం కూడా యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా కనిపిస్తోంది. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్ రాశి ఖన్నా నటిస్తూ ఉండగా రజిషా విజయన్ , చుంకీ పాండే కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు.

ఇటీవలే సర్దార్ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  ఇందులో కార్తి 6 విభిన్నమైన పాత్రలలో గెటప్పులలో బాగా ఆకట్టుకుంటున్నారు. ఇక భారీ నిర్మాణ విలువలు ఉన్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.  మరి ఈ సినిమాతో కార్తీ మంచి విజయాన్ని అందుకుంటారేమో చూడాలి మరి. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో కార్తి నటించిన సినిమాలో అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి మరి ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: