హారికా హాసిని ప్రొడక్షన్స్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్న సూర్యదేవర నాగవంశి త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అత్యంత సన్నిహితుడు. అంతేకాదు ఈ ప్రొడక్షన్ హౌస్ లో నిర్మించిన అనేక సినిమాలకు త్రివిక్రమ్ దర్శకుడుగా వ్యవహరించడమే కాకుండా ఈ ప్రొడక్షన్ హౌస్ లో త్రివిక్రమ్ కు పరోక్ష భాగస్వామ్యం ఉండటమే కాకుండా ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మించే అనేక సినిమాలకు త్రివిక్రమ్ సలహా సంప్రదింపులు ఉన్నాయి అంటారు.


లేటెస్ట్ గా ఈనిర్మాణ సంస్థ నిర్మించిన ‘స్వాతిముత్యం’ మూవీ దసరా కు విడుదలైన సందర్భంగా ఈమూవీని ప్రమోట్ చేస్తూ నిర్మాత సూర్యదేవర నాగవంశి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక హాలీవుడ్ రేంజ్ లో అత్యంత భారీ సినిమా తీయాలని తన కోరిక అని అంటూ ఎప్పటికైనా తన కోరిక అని అంటూ అలాంటి భారీ సినిమా ఎదో ఒకరోజు తమ సంస్థ నుండి వస్తుంది అని అంటున్నాడు.


వాస్తవానికి త్రివిక్రమ్ తన రేంజ్ ని మార్చుకుని పాన్ ఇండియా సినిమాల పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ప్రభాస్ రామ్ చరణ్ లతో వేరువేరుగా రెండు పాన్ ఇండియా సినిమాలను తీయాలని త్రివిక్రమ్ ప్రయత్నిస్తూ వాటికి తగ్గ కథల గురించి తన టీమ్ సభ్యులతో ఆలోచిస్తున్నట్లు ఇప్పటికే గాసిప్ లు వస్తున్నాయి.


మాటలను చాల పొదుపుగా తన సినిమాలలో ఉపయోగించే త్రివిక్రమ్ తన వ్యక్తిగత జీవితంలో కూడ చాల ఖర్చుదారి మనిషిగా ఉంటాడు అని అతడి సన్నిహితులు చెపుతూ ఉంటారు. ఆమధ్య త్రివిక్రమ్ కట్టుకున్న సొంత ఇంటిలోని ఫర్నిచర్ మరియు ఇంటీరియర్ చూసిన వారికి అదో సినిమా సెట్ లా అనిపిస్తుంది అని కామెంట్స్ చేస్తూ ఉంటారు.’బాహుబలి’ ‘ఆర్ ఆర్ ఆర్’ లు తరువాత ఆ రేంజ్ లో సినిమాలు తీయాలన్న్ కోరిక త్రివిక్రమ్ కు ఏర్పడింది. ఇప్పుడు నాగవంశి తో జతకట్టి హాలీవుడ్ రేంజ్ స్థాయిలో తెలుగు సినిమాను ఎప్పుడు తీస్తాడో చూడాలి..




మరింత సమాచారం తెలుసుకోండి: