ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా మొదట ఫ్లాప్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. ఇకపోతే ఈ సినిమా వారం రోజుల్లోనే ఊహించని విధంగా రూ.325కోట్లు రాబట్టి రికార్డు బ్రేక్ చేసింది. నిజానికి చాలా కాలం తర్వాత డైరెక్టర్ మణిరత్నం తన మార్క్ చూపించారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ విడుదలై ప్రేక్షకులలో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. మొదటి రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిపోయిన ఈ సినిమా ఇప్పుడు రూ.350 కోట్ల మార్క్ తో దూసుకుపోతోంది.

ఇకపోతే ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం వారం రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేసింది.  ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో ఇప్పటికే పలు రికార్డ్స్ బద్దలు కొట్టింది.  అంతేకాదు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ తారాగణంతో సెప్టెంబర్ 30వ తేదీన తెలుగుతో పాటు కన్నడ,  తమిళ్,  మలయాళం,  హిందీ భాషలలో కూడా విడుదల చేశారు. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి కూడా మంచి పాజిటివ్ రివ్యూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటి భాగం దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ఏడవ రోజు రూ.11.50  కోట్లు రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.195.5 కోట్లు,  ఓవర్సీస్ లో రూ.119 కోట్లు ప్రపంచవ్యాప్తంగా రూ. 314.5 కోట్లు వసూలు చేసింది. ఇదే సమయంలో తమిళ్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.318 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆల్ టైం రికార్డు బ్రేక్ చేసింది.

ఇక ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్,  విక్రమ్,  త్రిష,  కార్తీ,  జయం రవి , ప్రకాష్ రాజ్,  జయరాం , ఐశ్వర్య లక్ష్మి,  శోభిత దూళిపాళ్ల , ప్రభు తదితరులు కీలకపాత్రలో నటించారు . ఇకపోతే ఈ సినిమా సెకండ్ భాగం వచ్చే ఏడాది విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

PS1