టాలీవుడ్ కింగ్ నాగార్జున  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వయసులో కూడా ఫిట్ బాడీ ని మెయింటైన్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు కింగ్ నాగార్జున. ఇదిలావుండగా ఇక ప్రస్తుతం కింగ్ నాగార్జున మాటివిలో ప్రసరమవుతున్న బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇదిలావుంటే ఇక తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ 'ది ఘోస్ట్' దసరా కానుకగా ఇటీవల రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.అయితే  ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా

 తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.ఇకపోతే  ఈ సినిమా తరువాత నాగ్ తన నెక్ట్స్ మూవీపై అప్పుడే ఫోకస్ పెట్టాడు.అయితే టాలీవుడ్ కింగ్ నాగార్జున  కెరీర్‌లో 100వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను ఆయన ఎవరితో కలిసి చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే టాలీవుడ్ కింగ్ నాగార్జున  100వ చిత్రాన్ని గాడ్‌ఫాదర్ చిత్ర దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించబోతున్నట్లుగా చిత్ర వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే గాడ్‌ఫాదర్ సినిమా సక్సెస్ కావడంతో, మోహన్ రాజా తన నెక్ట్స్ సినిమాను నాగ్‌తో చేసేందుకు రెడీ అవుతున్నాడట.

అయితే  నాగ్‌కు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కావడంతో, ఈ సినిమాను మోహన్ రాజా కూడా చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడట.అయితే ఇక అందుకే ఈ సినిమాకు సంబంధించి అప్పుడే స్క్రిప్టు పనుల్లో ఆయన బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా నాగ్‌కు ఆయన చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట.ఇకపోతే ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో అఖిల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. అయితే మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: