అయితే నయనతార ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని మనకి తెలుస్తోంది. ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినా నయనతార కొత్త సినిమాలకు ఓకే చెప్పడం లేదు. హీరోయిన్ నయనతార అమ్మ కావాలనుకుంటున్నారని మనకు సమాచారం.
ఆ కారణం వల్లే నయనతార కొత్త ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పడం లేదని తెలుస్తోంది. నయనతార తన భర్త బ్యానర్ పై కొన్ని సినిమాలను నిర్మించడానికి మాత్రం ఓకే చెబుతారని తెలుస్తోంది. పెళ్లికి ముందు ఒప్పందం చేసుకున్న సినిమాలకు మాత్రమే ఆమె షూటింగ్ లకు ఓకే చెబుతున్నారని సమాచారం. గాడ్ ఫాదర్ సినిమాలోని సత్యప్రియ పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులే పడుతున్నాయి.
చిరంజీవికి గతంలో జోడీగా నటించిన నయనతార ఈ సినిమాలో మాత్రం చెల్లిగా నటించడం గమనార్హం. త్వరలో ఆమె తల్లి కాబోతున్నానని శుభవార్త చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కోలీవుడ్ మీడియాలో భారీగానే కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. నయనతారకు రాబోయే రోజుల్లో సినిమా ఆఫర్లు తగ్గే అవకాశం అయితే ఉంది. అందువల్ల ఆమె నిర్మాతగా కెరీర్ కొనసాగించాలని భావిస్తున్నారు.
నయనతారకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఆమె రాబోయే రోజుల్లో నటనకు గుడ్ బై చెబుతారంటూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ ప్రచారం గురించి ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి. నయనతార తను నటించిన సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొంటే బాగుంటుందని కొంతమంది సూచిస్తున్నారు. మరోవైపు నయనతార గతంలో తన రెమ్యునరేషన్ ద్వారా వార్తల్లో నిలిచారు. ఒక్కో ప్రాజెక్ట్ కు నయనతార 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని మనకు సమాచారం. నయనతార అమ్మ కావాలనుకుంటున్నారూ అంటూ ఈ విషయం బాగా సందడి చేస్తుంది..!!