అందుకు సంబంధించి గ్లింప్స్ , పోస్టర్లు చాలా వైరల్ గా మారాయి. అయితే తాజాగా ఈ షోకు సంబంధించి ట్రైలర్ కూడా విడుదల చేయడం జరిగింది ఆహా సంస్థ. అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం ఆహ లో స్ట్రిమ్మింగ్ కానున్నట్లు తెలియజేశారు.ఇక ఈ ట్రైలర్లో నిధిని అన్వేషిస్తూ బాలయ్య ఒక గుహలోకి వెళ్తారు. అక్కడ ఎన్నో సవాళ్లు అడ్డంకులు ఎదుర్కొని చివరికి ఆ నిధిని చేరుకుంటారు. అలా అన్నిటిని ఛేదించి చివరిగా ఒక బాక్స్ ఓపెన్ చేయగా అందులో ఖడ్గం లభిస్తుంది. అది చేత పట్టుకొని గెలిపే ఊపిరిగా పట్టుదలే ప్రాణంగా ఆశయమే గమ్యంగా పోరాడి యోధుడికి విజయం అన్ స్టాపబుల్ అని తెలియజేస్తారు.
ఇదంతా ఇలా ఉండగా అన్ స్టాపబుల్ సీజన్-2 అతిథిగా మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాబోతున్నారు ఇందుకు సంబంధించిన ఫొటోస్ కూడా నెత్తిన వైరల్ గా మారాయి మొదటిసారి చంద్రబాబు టాక్ షోకు రావడంతో అన్ స్టాపబుల్ -2 కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ఈ సీజన్ కు సంబంధించి ట్రైలర్ కూడా చాలా వైరల్ గా మారుతోంది.