సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సమంత.. కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో ఎన్నో వార్తలు వచ్చాయి. ఆమె ఆరోగ్యంపై కూడా ఎన్నో రూమర్స్ చక్కర్లు కొట్టాయి.


అయినా కూడా ఆమె ఎప్పుడూ కూడా బయటికి వచ్చింది లేదు.. ఏం జరుగుతుంది చెప్పింది లేదు. బహుశా ఆమె కెరీర్ లోనే మొదటిసారి ఇన్ని వార్తలు తనపై వస్తున్న కూడా.. కామ్ గా ఉండడం. అది ఆమె అభిమానులకు కూడా నచ్చలేదు. సమంత ఏం చేస్తుంది.. ఎక్కడుంది అంటూ వాళ్ళు కూడా ఆరా తీశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈమె చేసిన కామెంట్ ఒక పోస్ట్ నాగచైతన్యను టార్గెట్ చేస్తూ ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జోరు అందుకుంటుంది. పెళ్లికి ముందు ఎప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండే సమంత.. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం కొద్దిగా జోరు తగ్గించిందిట.


కొన్ని నెలల పాటు ఎలాంటి సినిమాలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత రంగస్థలం, మజిలీ, ఓ బేబీ, యూ టర్న్ లాంటి పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది. ఎప్పుడైతే నాగచైతన్యతో విడాకులు తీసుకుందో మళ్ళీ అప్పటి నుంచి సమంత తనలోని మరో కోణాన్ని బయటపెట్టింది. అప్పటి వరకు దాచుకున్న అందాలన్నింటినీ ఒకేసారి బయటపెట్టి.. సోషల్ మీడియాని షేక్ చేసింది. పుష్ప సినిమాలో ఈమె చేసిన ఐటమ్ సాంగ్ దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. ఊ అంటావా మావా ఊ ఊ అంటావా అంటూ సమంత చేసిన డాన్సులకు 6 నుంచి 60 వరకు అందరూ కాళ్లు కలిపారు. విడాకుల తర్వాత తనపై ఎన్ని వార్తలు వచ్చినా కూడా సైలెంట్ గానే ఉంది సమంత. అయితే ఈ మధ్య కాఫీ విత్ కరణ్ షోలో తనకు 250 కోట్ల భరణం ఇచ్చారు అనే వార్తలను ఆమె ఖండించింది.




అలాగే నాగచైతన్యను తనను ఒకే రూమ్ లో ఉంచితే కచ్చితంగా కత్తులను దూరంగా ఉంచాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేసింది. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో.. ‘కింద పడ్డాను కానీ వెనక్కి తగ్గలేదు’ అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఇది కేవలం చైతూను ఉద్దేశించి పెట్టింది అంటూ ప్రచారం మొదలైంది. విడాకుల తర్వాత తప్పంతా సమంతా చేసింది అంటూ ఈమెపై ఎంతో ప్రచారం జరిగింది. తనపై తప్పుడు వార్తలు రాసిన వాళ్లను కోర్టుకు ఈడుస్తాను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది సమంత. సరిగ్గా ఇలాంటి సమయంలో ఇప్పుడు కిందపడ్డాను కానీ వెనక్కి తగ్గలేదు అంటూ చేసినా పోస్ట్ నాగ చైతన్యను ఉద్దేశించి అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారట.. ఏదేమైనా సమంత ఏ కామెంట్ చేసినా అందులో చైతూను టార్గెట్ చేస్తుంది అనేది ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్న ప్రచారం. మరి అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఆమెకు మాత్రమే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: