బాబు, బాలయ్య వర్గం జూనియర్ ని దెబ్బతీయాలంటే మోక్షజ్ఞ దిగాల్సిందే అంటున్నారు అభిమానులు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయండి చాలు, స్టార్ ని చేసే బాధ్యత మేమే అంటున్నారు. మోక్షజ్ఞను తిరుగులేని స్టార్ ని చేస్తాం అంటున్నారు. ఈ క్రమంలో వేణు స్వామి కామెంట్స్ మాత్రం కలకలం రేపుతున్నాయి.
సెలబ్రిటీల పుట్టినరోజు ఆధారంగా వేణు స్వామి అడగకుండా జాతకాలు చెబుతారు. ఆయన చెప్పిన కొన్ని మాటలు నిజం కూడా అయ్యాయి మరి . సమంత-చైతూ విడాకులను వేణు స్వామి ముందుగానే అంచనా వేశాడు. తాజాగా ఆయన మోక్షజ్ఞ సినీ, రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా వెల్లడించారు. మోక్షజ్ఞ జాతకం ప్రకారం అతడు సినిమాల్లో రాణిస్తాడట. స్టార్ కూడా అయ్యే అవకాశం కలదట. మోక్షజ్ఞ హీరోగా నందమూరి అభిమానుల కోరిక నెరవేరుస్తాడట.
అయితే ఎన్టీఆర్ వారసుడిగా ఆయన రాజకీయాల్లోకి రావాలని, సీఎం పీఠం ఎక్కాలని ఆశించే అభిమానులు ఎందరో ఉన్నారు . బాలయ్యకు ఆ అవకాశం దక్కకపోయినా మోక్షజ్ఞ టీడీపీకి వెన్నెముక కావాలని, ఆయన సారథ్యంలో టీడీపీ నడవాలని కోరుకునే వర్గం కూడా ఉన్నారు. కానీ వాళ్ళ కోరిక తీరదని వేణు స్వామి జోస్యం చెప్పారు ఇలా, మోక్షజ్ఞ జాతకం ప్రకారం పాలిటిక్స్ లో భవిష్యత్తు లేదట. అక్కడ చెప్పుకోదగ్గ స్థాయికి చేరలేడనేది వేణు స్వామి అంచనా..
మరి ఇదే నిజమైతే నందమూరి అభిమానులకు తీవ్ర నిరాశ తప్పదు mari. ఒక ప్రక్క ఎన్టీఆర్ టీడీపీని లాగేసుకుంటాడనే భయాలు ఎక్కువగా వెంటాడుతుండగా మోక్షజ్ఞకు రాజకీయాలు కలిసి రావని వేణు స్వామి ముందే చెప్పడం కలవర పెడుతుంది. ఆలూ లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు మోక్షజ్ఞ సీనియాల్లోకే రాలేదు. రాజకీయాల గురించి ఆలోచించడం అనవసరమా అని, మరోవైపు మోక్షజ్ఞకు హీరో అవ్వాలని లేదన్న పుకార్లు ఉన్నాయి. అందుకే ఆయనకు ముప్పై ఏళ్ళు దగ్గర పడుతున్నా ఎంట్రీ ఇవ్వలేదంటున్నారు అభిమానులు