'మహానటి' విడుదల అయి నాలుగేళ్లు అవుతున్నా కీర్తి సురేష్  ని ఇంకా మహానటి సినిమాతోనే  తనను పిలుస్తూ వుంటారు.

ఆ తరువాత కీర్తి సురేష్ సినిమాలు చాల విడుదల అయ్యాయి కానీ, ఏ సినిమా కూడా 'మహానటి' అంత ప్రభావాన్ని చూపించలేక పోయాయి మరీ . ఆ 'మహానటి' సినిమా ప్రభావం అంత వుంది అన్నమాట. ఆ తరువాత చాల సినిమాలు కీర్తి సురేష్ ని ప్రధానంగా చేసుకొని వచ్చాయి, కానీ ఒక్క చిత్రం కూడా సరిగ్గా ఆడలేదు. ఈ సంవత్సరం మహేష్ బాబు తో వచ్చిన 'సర్కారు వారి పాట' కూడా అనుకున్నంత విజయం సాధించలేదు కానీ, కీర్తి సురేష్ కి మంచి పేరు మాత్రం తీసుకు వచ్చింది.

మహానటి సినిమా తరువాత, కీర్తి సురేష్ కి కొంచెం అలంటి పాత్రలే ఎక్కువ వచ్చాయి. అయితే కీర్తి సురేష్ తాను గ్లామర్ పాత్రలు కూడా బాగా చేస్తానని కూడా నిరూపించుకోవడానికి, చాల బరువు తగ్గి, మనిషి చాల అందంగా తయారయింది. ఆ ఫోటోస్ ఆమె సాంఘీక మాధ్యమాల్లో విడుదల చేసింది. జాతీయ అవార్డు అందుకున్న ఈ నటి ఇప్పుడు మంచి కమర్షియల్ సినిమా చెయ్యడానికి సిద్దం అవుతోంది

తెలుగు లో చిరంజీవి  తో 'భోళా శంకర్' అనే సినిమాలో నటిస్తోంది. కానీ ఇందులో చిరంజీవి కి వ్యతిరేకంగా కథానాయికగా కాకుండా, చిరంజీవి కి చెల్లిగా నటిస్తోంది. ఇంతకు ముందు రజనీకాంత్ తో కూడా ఇలానే చెల్లిగా 'అన్నాత్తే ' అనే సినిమాలో నటించింది కానీ, ఆ సినిమా అంతలా ఆడలేదు. చెల్లి పాత్రలు ఆమెకి ఆచ్చి రాలేదు ఏమో మరి

తెలుగులో కీర్తి సురేష్ ''దసరా' చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. ఇందులో నానీ పక్కన నటించింది. ఆమె నానితో చేస్తోన్న రెండో సినిమా ఇది మరీ . ఇంతకు ముందు 'నేను లోకల్' అనే సినిమా చేసింది, అది పెద్ద హిట్ అయింది. ఇప్పుడు 'దసరా' చేస్తోంది, ఇది ఎలా ఉంటుందో  వేచి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: