స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్పకు క్రేజ్ ఏ మాత్రం కూడా తగ్గట్లేదు. పాన్ ఇండియాలో ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ అయితే ఉన్నారు.
ఆ సినిమాలోని పాటలకు విదేశీయులు సైతం స్టెప్పులేశారు. ఈ చిత్రంలోని బన్నీ డైలాగ్ తగ్గేదేలే అంటూ చేసే యాక్షన్‌కు మామూలు ఫాలోయింగ్ కాదు. తాజాగా అల్లు అర్జున్ యాక్షన్‌కు అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ సైతం ఫిదా అయిపోయారని తెలుస్తుంది.తగ్గేదేలే అంటూ బన్నీ స్టైల్లో యాక్షన్ చేసి చూపించారు. టాలీవుడ్ యాంకర్ అనసూయ పక్కనే ఉండగా మేయర్ అల్లు అర్జున్ యాక్షన్‌లో అదరగొట్టరు.
న్యూయార్క్‌లో దసరా సందర్భంగా తెలుగు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యాంకర్ అనసూయ కూడా హాజరయ్యారట. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మేయర్ అక్కడే ఉన్న ప్రజలతో మమేకమై వారితో కలిసి బతుకమ్మ పండుగను కూడా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో న్యూయార్క్ మేయర్ ఆఫీస్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోపై పుష్ప టీం స్పందిస్తూ ' భారతీయ చిత్రంపై మీ ప్రేమను చూపినందుకు ధన్యవాదాలు. ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అనసూయ, మంగ్లీకి ప్రత్యేక కృతజ్ఞతలు' అంటూకామెంట్ చేసింది. ఇటీవలే ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప-2 మూవీ కూడా షూటింగ్ ప్రారంభమైందని తెలుస్తుంది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' సినిమా అవార్డుల్లోనూ తగ్గేదేలె అంటోంది. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా ఎన్నో రికార్డులను కూడా తిరగరాసింది. తాజాగా ప్రతిష్టాత్మక 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ పుష్ప క్లీన్ స్వీప్ కూడా చేసేసింది. ఏకంగా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అయితే సొంతం చేసుకుని సత్తాచాటింది.రాబోయే పుష్ప సీక్వల్ కూడా భారీ అంచనాలతో విడుదల కాబోతుంది. తిరిగి ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో మరి...