ముఖ్యంగా ఆమె అభిమానులు తన కామెంట్స్ విని తెగ ఆందోళనకు గురవుతున్నారు. తమ అభిమాన నటి వివాహం చేసుకుని పిల్లా పాపలతో కలకాలం కలిసి ఉండాలని వారు కోరుకుంటే త్రిష స్టేట్మెంట్స్ విని వారంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. త్రిష దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది.
త్రిషతో కెరీర్ ప్రారంభించిన వారంతా ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో సెటిల్ కూడా అయిపోయారు. మరికొందరు ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. కానీ ఈ బ్యూటీ మాత్రం నేటికి సినిమాలు చేస్తూ అవకాశాలను దక్కించుకుంటోంది. త్రిష అప్పట్లో 96 మూవీలో నటించి భారీహిట్ అందుకుంది. 96 మూవీలో విజయ్ సేతుపతి, త్రిష నటనకు గాను ఫ్యాన్స్ అందరూ ఫిదా అయ్యారు. ఇండస్ట్రీలో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం బాగా కురిపించింది. రీసెంట్‌గా త్రిష పొన్నియన్ సెల్వన్ మూవీలో నటించిన విషయం తెలిసిందే.మణిరత్నం తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం మంచి విజయం సాధించింది.
నా లైఫ్‌లో అలాంటిది చూడలేను అని
ఈ క్రమంలోనే సక్సెస్ మీట్‌కు వెళ్లిన ఈ అమ్మడుని చాలా మంది పెళ్లి ఎప్పుడని అడుగడంతో తీవ్ర నిరాశకు గురైందట.. ఈ సందర్భంగా తను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా పెళ్లి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. పెళ్లి ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారు. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు సరైన తోడు దొరికినపుడు నేను పెళ్లి చేసుకుంటాను. అయినా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగితే వేరు. పెళ్లి ఇంకెప్పుడు చేసుకుంటావ్ అని అడుగడం వేరు. నా చుట్టూ ఉన్నవాళ్లంతా పెళ్లిళ్లు చేసుకుని సంతోషంగా ఏమీ లేరు. కొందరు విడాకులు తీసుకుని ఉంటున్నారు. పెళ్లి అయ్యాక విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం లేదని' త్రిష స్పష్టం చేసింది.