మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు పారితోషికం విషయంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నారనే సంగతి మనందరికీ  తెలిసిందే.ఇక  రాజకీయాల్లోకి చిరంజీవి ఎంట్రీ ఇచ్చిన తర్వాత యంగ్ జనరేషన్ స్టార్ హీరోల హవా పెరగడంతో పాటు ఆ హీరోల రెమ్యునరేషన్లు సైతం భారీగా పెరిగాయి.ఇకపోతే చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకున్నారు.అయితే ఆచార్య సినిమాకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్న చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకు మాత్రం ఏకంగా 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది.

 ఇక సీనియర్ హీరోలలో రెమ్యునరేషన్ విషయంలో చిరంజీవి రేంజ్ లో అందుకునే మరో హీరో అయితే లేరని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సినిమా నిర్మాతలలో చరణ్ ఒకరు అయినా చిరంజీవి రెమ్యునరేషన్ ను మాత్రం సినిమా రిలీజ్ కు ముందే ఇచ్చేశారని బోగట్టా.ఇదిలావుంటే మరోవైపు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించినా రెమ్యునరేషన్ తీసుకోలేదు. అయితే ఇక  రామ్ చరణ్ త్వరలో సల్మాన్ ఖాన్ ను డైరెక్ట్ గా కలిసి గిఫ్ట్ రూపంలో రెమ్యునరేషన్ ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. కాగా 5 కోట్ల రూపాయల విలువైన బహుమతిని సల్మాన్ ఖాన్ కు ఇవ్వాలని చరణ్ డిసైడ్ అయ్యారని బోగట్టా.

అంతేకాదు మరోవైపు ఆరు రోజుల్లో ఈ సినిమా 52 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.అయితే మరో 40 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తే మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉండగా ఆ రేంజ్ లో గాడ్ ఫాదర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం సులువు కాదు.ఇక  దసరా సెలవులు మొదలైన సమయంలోనే గాడ్ ఫాదర్ సినిమాను రిలీజ్ చేసి ఉంటే మాత్రం ఈ సినిమాకు మరింత బెనిఫిట్ కలిగి ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాసినిమాకు చిరంజీవి రేంజ్ పెరుగుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: