ఓరి దేవుడా
ఇక అక్టోబర్ 21వ తేదీన అయితే ఒకేసారి నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమా తమిళ రీమేక్ అయినప్పటికీ కూడా మంచి ఆసక్తిని కలుగజేస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు.
మంచు విష్ణు జిన్నా
ఇక మంచు విష్ణు నటించిన చిన్నా సినిమా అక్టోబర్ 21వ తేదీన రాబోతోంది. ఈ సినిమా అసలైతే దసరా సందర్భంగా విడుదల కావాల్సింది. కానీ అప్పుడు పోటీ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు పోటీగా మరిన్ని సినిమాలు వస్తున్నా కూడా మంచి విష్ణు వెనక్కి తగ్గకుండా దీపావళి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఫుల్ కామెడీ యాక్షన్ ఫిలిం గా తెరపైకి రాబోతోంది. సన్నిలియోన్ పాయల్ రాజ్ పుత్ ముఖ్యమైన పాత్రలలో నటించారు.
అనుదీప్ ప్రిన్స్
ఇక జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ తమిళ హీరో శివకార్తికేయన్ తో చేసిన ప్రిన్స్ సినిమా కూడా అక్టోబర్ 21వ తేదీనే రాబోతోంది. అనుదీప్ కు తెలుగులో జాతి రత్నాలు సినిమాతో మంచి గుర్తింపు లభించింది. దీంతో ఇప్పుడు ప్రిన్స్ సినిమాకు కూడా ఆ క్రేజ్ దక్కే అవకాశం ఉంది. అలాగే మరో తమిళ సినిమా సర్దార్ కూడా అదే రోజు రాబోతోంది. కార్తి హీరోగా నటించిన ఈ మాస్ యాక్షన్ ఫిలిం పై ఓవర్గం ప్రేక్షకులలో అంచనాలు ఉన్నాయి.
అక్షయ్ కుమార్ రామ్ సేతు
ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన రామ్ సేతు సినిమా అక్టోబర్ 25వ తేదీన విడుదల కాబోతోంది. హిందీలోనే కాకుండా ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి మరి విడుదల చేస్తున్నారు. రామాయణంలోని రామ్ సేతు ఆధారంగా తెరపైకి తీసుకువచ్చిన ఈ అడ్వెంచర్ మిస్టరీ ఫిలిం పై ఓవర్గం ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తప్పకుండా తెలుగులో కూడా సక్సెస్ అవుతుంది అని భారీగానే విడుదల చేయబోతున్నారు మరి సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.