ఈ నేపథ్యంలో హీరో విశ్వంత్ మీడియాతో సంభాషించారు. 'ఈ సినిమాలో మంచి ప్రేమ కథ ఉంది. 'బారుఫ్రెండ్ ఫర్ హైర్' కాన్సెప్ట్‌ని చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తున్నాం. చాలా ఫన్ ఉంటుంది. ఇప్పటి వరకు నేను లవర్‌బారు పాత్రలు చేశాను. ఇందులో మాత్రం ప్లేబారుగా చేశాను. మొదటిసారి నా కంఫర్ట్ జోన్‌ని దాటి ఈ సినిమా చేశా. దీన్ని చాలా మంది బోల్డ్ ఫిల్మ్ అనుకుంటారు. కానీ ఇందులో మోడరన్ కంటెంట్ ఉంటుంది తప్పితే బోల్డ్ ఫిలిం కాదు. చాలా క్లీన్ ఫిల్మ్. చాలా మంచి ఎమోషన్ ఉన్న సినిమా ఇది. ఇందులో నేను చేసిన పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. నాకు కాస్త సిగ్గు, మొహమాటం ఎక్కువే. ఈ సినిమాలో హైర్ కాకుండా పెళ్లి గురించి కూడా ఇందులో ప్రస్తావన ఉంటుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో కూడా ఇద్దరి మధ్య ఎలాంటి అండర్ స్టాండింగ్ ఉండాలనేది ఇందులో చూపించాం. యూత్ ఆడియన్స్‌కి బాగా నచ్చే సినిమా ఇది.
'బారుఫ్రెండ్ ఫర్ హైర్' అనేది ఎమోషనల్ సపోర్ట్ యాప్. ఈ సినిమాలో నేను చేసింది కూడా ఒక ఎమోషనల్ సపోర్ట్‌గానే ఉంటుంది. ఓ మంచి ఫన్ కథతో సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాం.సమాజంలో జరుగుతున్న దాన్నే ఎంటర్టైన్మెంట్ విధానంలో చూపించాం. ప్రస్తుతం రామ్ చరణ్-శంకర్ సినిమా, 'కథ వెనుక కథ', 'నమో', అలాగే 'కాదల్' సినిమా చేస్తున్నా. భవిష్యత్‌లో హర్రర్ తప్ప మిగతా జోనర్ సినిమాలన్నీ చేస్తా. గౌరవప్రదమైన సినిమాలు చేయాలనేది నా లక్ష్యం.