సాధారణ మధ్య తరగతి కుటుంబాలకు పెళ్ళైన , విడాకులైన చాలా పెద్ద విషయం..కానీ సినిమా ఇండస్ట్రీ వారికి అది చాలా సాధారణమైన విషయం అయిపోయింది..ఎంత తొందరగా అయితే పెళ్లి చేసుకుంటున్నారో..అంతే తొందరగా విడిపోతున్నారు..దానికి ఉదాహరణ గా ఇటీవల కాలం లో ఎన్నో సంఘటనలు ఉన్నాయి..ఇప్పుడు లేటెస్ట్ గా మరో జంట కూడా విడాకులు తీసుకోబోతున్నట్టు సోషల్ మీడియా లో గత కొంతకాలం నుండి వార్తలు వినిపిస్తున్నాయి..వాళ్లెవరో కాదు విజయ్ ఆంటోనీ - ఫాతిమా జంట..విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..బిచ్చగాడు సినిమాతో ఈయన తెలుగు మరియు తమిళంబాషలలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడో మన అందరికి తెలిసిందే..ఈ సినిమా విజయం సాధించడం తో విజయ్ ఆంటోనీ కి తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది..ఆ సినిమా తర్వాత ఆయన తెలుగు లో ఎన్నో సినిమాలను దబ్ చేసి విడుదల చేసాడు..ఇక అసలు విషయానికి వస్తే విజయ్ ఆంటోనీ 2006 వ సంవత్సరం లో ఫాతిమా అనే అమ్మాయిని పెళ్లాడాడు.తన సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఇంటర్వూస్ ఇస్తున్న సమయం లో యాంకర్ గా పరిచయమైనా 'ఫాతిమా' అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాడు విజయ్ ఆంటోనీ..కోలీవుడ్ లో ఈ జంట మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు కూడా తెచ్చుకుంది..ఒకరి కోసం ఒకరు పుట్టారు అనేంతలా అనిపించే ఈ జంట మధ్య ఇటీవల కాలం లో గొడవలు ఏర్పడ్డాయని..ఆ గొడవలు విడాకులు వరుకు దారి తీసిందని కోలీవుడ్ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది..అయితే ఇలాంటి రూమర్స్ సెలెబ్రిటీల నుండి రావడం సహజమే కదా అని అనుకోవచ్చు.కానీ లేటెస్ట్ గా విజయ్ ఆంటోనీ పెట్టిన ఒక పోస్టు ఈ రూమర్స్ నిజమేనేమో అని నమ్మేలా చేస్తుంది..'ఇద్దరి మధ్య సమస్య ఉంటె దానిని పరిష్కరించడానికి ఎప్పుడు కూడా మూడవ వ్యక్తిని మీ జీవితం లోకి రానివ్వొద్దు..దాని వల్ల మీ జీవితాలే మారిపోతాయి..జాగ్రత్తగా ఉండండి' అంటూ విజయ్ ఆంటోనీ పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ గా మారింది..ఈ పోస్టుని గమనిస్తే జీవితం లో ఆయనకీ ఎదురైనా అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అభిమానులతో పంచుకున్నట్టు తెలుస్తుంది..తన భార్య తో విడాకులు అవ్వబోతుంది అనే వార్తకి బలం చేకూరుస్తుంది..మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ రాబొయ్యే కాలం లో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: