దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఆర్‌సీ 15 చిత్రం ఏపీలో షూటింగ్ జరుపుకుంటోంది. అంజలి, రాంచరణ్‌తోపాటు లీడ్ రోల్స్‌పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారుట.


ఈ చిత్రాన్ని 2023లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది..

ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్‌సీ 15 (Rc15) చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఏపీలో షూటింగ్ జరుపుకుంటోంది. అంజలి, రాంచరణ్‌తోపాటు లీడ్ రోల్స్‌పై వచ్చే సన్నివేశాల ను చిత్రీకరిస్తున్నారట ఈ చిత్రాన్ని 2023లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట  


కాగా రాంచరణ్ యువ దర్శకుడు గౌతమ్ తిన్నురీ సినిమా చేయనున్నట్టు గతంలో వార్తలు వచ్చినా..ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయినట్టు మరోవైపు పుకార్లు వచ్చాయట . అంతేకాదు చరణ్ కన్నడ డైరెక్టర్ నార్ధన్ తో కూడా ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయట.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ టైంలో జక్కన్న చెప్పిన మాటలు త్వరలో నే రాంచరణ్ కొత్త సినిమా ప్రకటన ఉండబోతుందా..? అని అభిమానుల మధ్య చర్చకు అయితే దారి తీస్తున్నాయి.


చరణ్‌, సుకుమార్ (sukumar)కాంబినేషన్‌ లో సినిమా ఉండబోతుందని, ఓపెనింగ్ సీన్ కూడా తనకు తెలుసునన్నాడట రాజమౌళి. అయితే దీనిపై రాంచరణ్ నుంచి మాత్రం అధికారికం గా ఎలాంటి అప్‌డేట్ రాలేదు. కానీ ప్రస్తుతం కొందరు అభిమానులు మాత్రం త్వరలో నే రాంచరణ్ కొత్త సినిమా ప్రకటన ఉండబోతుందంటూ చర్చించుకోవడం మొదలుపెట్టినట్టు నెట్టింట ఓ వార్త అయితే హల్ చల్ చేస్తోంది.


త్వరలో అల్లు అర్జున్ తో సీక్వెల్ ప్రాజెక్ట్‌ పుష్ప..ది రూల్‌తో బిజీ కానున్నాడు సుకుమార్. మరి ఇలాంటి పరిస్థితుల్లో సుకుమార్‌-రాంచరణ్ సినిమా ఉండటం సాధ్యమేనా..? అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారట నెటిజన్లు. రానున్న రోజుల్లో చరణ్‌-సుకుమార్ ఉంటుందా..? అనే దానిపై క్లారిటీ రానుందని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: