పూనమ్ కౌర్ సినిమాలు చేసింది తక్కువ అయినా కూడా సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే పోస్టుల వల్ల తీవ్రస్థాయి లో వివాదాలను ఎదుర్కొంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచేవారు.


ఇలా వివాదాల ద్వారా ఈమె ఎంతో ఫేమస్ అయ్యారు. అయితే సోషల్ మీడియా వేదిక గా ఈమె చేసే పోస్టులు ఎవరినీ కూడా ఉద్దేశించి చేస్తారో అర్థం కాదు. అయితే ఈమె చేసే పోస్టులు అంత ఈజీగా ఎవరికి అర్థం కావు అయితే తాజాగా ఇలాంటి పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈమె చేసిన ఈ పోస్ట్ చూస్తుంటే ఈమె ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయట.


ఉత్తర భారత దేశం లో పెళ్లైన మహిళలు ఎంతో సాంప్రదాయపద్ధంగా జరుపుకునే పండుగలలో కార్వా చౌత్ ఒకటి. పెళ్లైన మహిళలు తమ భర్త క్షేమంగా సుఖసంతోషాలతో ఉండాలని ఈ పండుగను జరుపుకుంటారు.అయితే పూనమ్ కౌర్ కూడా ఈ పండుగను జరుపుకున్నట్లు తాజాగా ఈమె చేసిన పోస్ట్ చూస్తుంటే అర్థమవుతుందట..ఈ క్రమంలో నే ఈ హీరోయిన్ ఎవరికీ తెలియకుండా పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు అంటూ సందేహాలను కూడా వ్యక్తపరుస్తున్నారు.


ఈమె కూడా పెళ్లయిన మహిళ మాదిరిగా నే చేతి లో జల్లెడ పట్టుకొని దీపాల వెలుగుల ను చూస్తూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈమె వ్యవహార శైలి ఎవరికి అర్థం కాక పెద్ద ఎత్తున ఈ ఫోటో పై కామెంట్లు చేస్తున్నారట.. ఈమె పెళ్లి చేసుకొని ఈ పండుగను జరుపుకున్నారా లేకపోతే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా అని కామెంట్ లు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు పూనమ్ ఏమాత్రం స్పందించలేదట.. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే పూనమ్ స్పందించాల్సి ఉంది. పూనమ్ కౌర్ ఎప్పుడూ కూడా కాంట్రావర్సీ పోస్ట్లు తో నిత్యం యాక్టీవ్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: