. మోహన్ రాజా చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథని మార్చారు అని చెప్పవచ్చు,
అయితే ఈ చిత్రానికి వసూళ్లు కాస్త నెమ్మదించినట్లు మనకు తెలుస్తోంది. ఆల్రెడీ ఓటిటిలో తెలుగులో ఒరిజినల్ వర్షన్ అందుబాటులో ఉండడం లాంటి చాలా కారణాలు కలెక్షన్స్ డ్రాప్ కి కారణాలుగా చెబుతున్నారు. అయితే చిరంజీవి మాత్రం ఫ్యాన్స్ కోరుకునే విధంగా సాలిడ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు.
ఈ చిత్రంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ జర్నలిస్ట్ పాత్రలో నటించారు మరి . పూరి నటించిన సన్నివేశాలకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇటీవల గాడ్ ఫాదర్ చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కి దాదాపుగా చిత్ర యూనిట్ అందరూ హాజరయ్యారు.
చిరంజీవి పూరి జగన్నాధ్ ని కూడా ఇన్వైట్ చేశారట. కానీ పూరి తాను నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ లో చాలా బిజీగా ఉండడంతో రాలేనని చెప్పారట. అయితే ఇప్పుడు గాడ్ ఫాదర్ కి మరో సాయం చేసేందుకు పూరి జగన్నాధ్ రంగంలోకి దిగారు.
పూరి జగన్నాధ్ స్వయంగా మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా పూరి, చిరంజీవి మధ్య ఇంటర్వ్యూ ఉండబోతోంది. గాడ్ ఫాదర్ విశేషాలు, ఇతర అంశాల గురించి ఇంటర్వ్యూలో పూరి చిరంజీవిని ప్రశ్నించబోతున్నారు.
ఇదిలా ఉండగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో గతంలో చిరంజీవి నటించాల్సింది. ఆ చిత్రానికి ఆటోజానీ అనే టైటిల్ కూడా మనకు వినిపించింది. కానీ కథ పూర్తిగా నచ్చకపోవడంతో చిరు ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు అని టాక్ ఉంది . మరి ఆ మూవీ గురించి ఇప్పుడు వీరి మధ్య ఏమైనా చర్చ జరుగుతుందేమో చూడాలి. సోషల్ మీడియాలో ఆ రకమైన రూమర్స్ కూడా తెగ వినిపిస్తున్నాయి.