![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/business_videos/god-father-kanthara-movie-collections9b440ef2-8d35-4dfc-a245-5a72cce71644-415x250.jpg)
గత వారం నుండి గాడ్ ఫాథర్ మంచి కలెక్షన్ లతో నడుస్తోంది. అయితే ఈ రోజు థియేటర్ లలో ఒక కన్నడ మూవీ డబ్ అయ్యి రిలీజ్ అయింది. ఈ సినిమాకు కూడా మార్నింగ్ షో నుండి మంచి టాక్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గత వారమే కన్నడలో ఈ సినిమా విడుదల అయింది. ప్రముఖ నటుడు మరియు దర్శకుడు రిషబ్ శెట్టి ఎంతో ఫాషన్ తో తెరకెక్కించిన మూవీ కాంతార.. ఇది ఒక గ్రామీణ నేపధ్యం కలిగిన సినిమా. ఎంతో సహజంగా చిత్రీకరించారు... కన్నడలో ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. అందుకే ఇతర బాషలలో కూడా విడుదల చెయ్యాలని మేకర్స్ అలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు.
అందులో భాగంగానే ఈ రోజు తెలుగులో థియేటర్ లలో ఎంతో గ్రాండ్ గా విడుదల చేశారు. విడుదలైన ప్రతిచోటా ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది, నిన్నటి వరకు కేవలం గాడ్ ఫాదర్ సినిమా ఒక్కటే కలెక్షన్ లను తీసుకుంటే... ఇపుడు కాంతార నుండి గట్టి పోటీ ఎదురయ్యేలా ఉంది. కన్నడ సినిమాలను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు.. ఇంతకు ముందు కెజిఎఫ్ చాప్టర్ లతో టాలీవుడ్ ను ప్రశాంత్ నీల్ వణికించాడు. మరి ఈ సినిమా గాడ్ ఫాదర్ కలెక్షన్ లకు గండి కొడుతుందా లేదా అన్నది తెలియాలంటే మరొక వారం ఆగాల్సిందే.