రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార సినిమా అద్భుతమైన వసూళ్లు ను సాధిస్తూ ముందుకు వెళుతుంది.
నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీన కన్నడలో విడుదలైంది. అక్కడ మంచి హిట్ అవడంతో దీన్ని తెలుగు, మలయాళ , హిందీ భాషల్లో కూడా అక్టోబర్ 15వ తేదీన విడుదల చేశారట. మొదటి ఆట నుంచే ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కుతున్నాయి. నటీనటుల అద్భుతమైన నటన సినిమా నేరేషన్ అలాగే సినిమా క్లైమాక్స్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చేస్తుంది.
అయితే ఈ కాంతార సినిమా చూసిన తర్వాత తెలుగు అభిమానులు అందరూ ఈ సినిమాకు తెలుగులో విడుదలైన రామ్ చరణ్ తేజ్ రంగస్థలం సినిమాకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయని అంటున్నారట.. కథ కొంచెం ఒకలాగే అనిపించిందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ కాంతార సినిమా తెలుగు సహా మలయాళ, హిందీ భాషల్లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో రంగస్థలం సినిమాని హిందీ అలాగే ఇతర భాషల్లో విడుదల చేయకుండా తప్పు చేశారేమో అనే వాదన కూడా వినిపిస్తోంది.
ఒకవేళ విడుదల చేసి ఉంటే పుష్ప, కేజీఎఫ్, కాంతార లాగానే ఆ సినిమా కూడా మంచి వసూళ్ల వర్షం కురిపించడమే కాక తెలుగు నుంచి మరో మంచి సినిమాను అందించినట్టు ఉండేదని ఇప్పుడు కొందరు అభిప్రాయపడుతున్నారు. రంగస్థలం సినిమా కూడా పుష్పలాగానే పూర్తిస్థాయి రా, రస్టిక్ సినిమా కావడంతో మొదట ఒక సెక్షన్ ఆడియన్స్ కి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది అనుకుంటే దాదాపుగా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చేసిందట.. అందుకే ఇప్పుడు కాంతార సినిమా చూసిన తర్వాత రంగస్థలం ఒక మంచి అద్భుతమైన గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందేమో అని అభిప్రాయపడుతున్నారు. ఇక పోల్చి చూస్తే ఈ రెండు సినిమాలు దాదాపుగా రివెంజ్ డ్రామా చుట్టూ తిరుగుతాయని తెలుస్తుంది..
అలాగే రెండు సినిమాల్లో హీరో సోదరుడిని హీరో బాగా నమ్మే దగ్గర వ్యక్తి చంపేస్తాడు, దీంతో అతని మీద పగ తీర్చుకోవడం కోసం హీరో అప్పటివరకు తాను బాస్ గా ఫీలయ్యిన వ్యక్తినే చంపేస్తాడట. అయితే ఈ రెండు సినిమాల్లో ఈ పాయింట్స్ మాత్రమే కామన్ కాగా ప్రేక్షకులు మాత్రం రంగస్థలం లాగానే ఉంది అనే కామెంట్స్ అయితే చేస్తున్నారట. అయితే రంగస్థలం పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయకుండా తప్పు చేశారేమో అనే వాదన వినిపిస్తోంది. నిజానికి కొన్నాళ్ల తరువాత రంగస్థలం సినిమాను తమిళ సహా కొన్ని బాషలలో విడుదల చేసినా క్రేజ్ ఉన్నప్పుడే రిలీజ్ చేసి ఉంటే బాగుండని కొందరు అభిప్రాయపడుతున్నారట .