మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'జిన్నా' సినిమా ఈనెల 21న విడుదలకు రెడీ అవుతోంది.


ఈ నేపథ్యంలోనే చిత్రబృందం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టిందట.ఇందులో భాగంగానే ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో సినిమాటోగ్రఫర్ ఛోటా కే నాయుడు మాట్లాడుతూ.. ''నేను మంచు కాంపౌండ్‌లో చేసిన తొలి సినిమా ఇది. తొలుత ఈ కథ తనకు కోన వెంకట్ వినిపించినప్పుడు నాకు బాగా నచ్చింది. సెకండాఫ్ అయితే మరింత అద్భుతంగా ఉందని దీంతో ఈ సినిమా చేద్దామని అన్నాను. హీరో మంచు విష్ణు అనగానే, ఓకే అన్నాను. కానీ.. ఈ సినిమాకి మోహన్‌బాబు నిర్మాత అన్నప్పుడు వెంటనే కారు ఆపేయమని అన్నాను. ఈ సినిమా చేయనని చెప్పాను. ఎందుకని కోన వెంకట్ ప్రశ్నిస్తే.. మోహన్‌బాబుకు నేనంటే అస్సలు నచ్చదు, ఆయనకు నేనంటే కోపం, అగ్నిపర్వతాలు బద్దలైపోతాయని చెప్పాను. అప్పుడు నాకు నచ్చజెప్పి, మోహన్‌బాబు ఆఫీస్‌కి తీసుకెళ్లారు'' అని చెప్పాడు.


''ఆఫీస్‌కి వెళ్లగానే ఆయన స్వాగతించిన విధానం చూసి ఒక్కసారిగా షాకయ్యా. బహుశా ఆయన గురించి నేను అనుకున్న పర్‌సెప్షన్ తప్పు అయ్యుంటుందని ఆ క్షణం అనిపించిందట.. అంతేకాదు.. ఈ సినిమా విషయంలో ఆయన నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. నన్ను మరో కొడుకుగా చూసుకున్నారు'' అని మోహన్‌బాబు గురించి ఛోటా కే నాయుడు చెప్పుకొచ్చాడు. అనంతరం మంచు విష్ణు గురించి మాట్లాడుతూ.. ''షూటింగ్‌లో విష్ణు నస పెడతాడేమోనని అనుకున్నాను. కానీ, ఏ విషయంలోనూ అతడు జోక్యం చేసుకోలేదని నేను అనుకున్న విష్ణు వేరు.. నేను చూసిన విష్ణు వేరు. సినిమా కోసం అతడు ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. అతని కాలుకి అయిన గాయమే అందుకు నిదర్శనం. ఒక సీన్‌లో రింగులు తిరుగుతూ జంప్ చేయాల్సి వస్తుంది. దాని వల్ల కాలుకి గాయం అయ్యింది. రిస్క్ చేయాలి కానీ, మరి ఎక్కువ రిస్క్ చేయకూడదు. కాబట్టి, మరీ గాయాలయ్యేంత రిస్కులు చేయొద్దని విష్ణుకి సూచిస్తున్నాను'' అంటూ పేర్కొన్నాడట.. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని తనకు నమ్మకం ఉందని, ఇది మోహన్‌బాబుకి ఇచ్చే గిఫ్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమా డైరెక్టర్ సూర్యలో తనకు ఒక క్రాంతి, ఒక జంధ్యాల కనిపించారని అన్నాడట.. కోన తనను మోహన్‌బాబు దగ్గర ఇరికించాడని తాను అనుకున్నానని, కానీ కోన వల్ల తనకు మరో ఆస్తి దొరికినట్టు అయ్యిందని ఛోటా కే నాయుడు వెల్లడించాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: