సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు తమకు ఉన్న అలవాట్ల వల్లే ఇండస్ట్రీకి దూరం అవుతారట.. ఎంతో స్టార్ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లు సైతం చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు.


ఇక ఈ జాబితాలోకే వస్తుంది రస్నా బ్యూటీ అయిన అంకిత. ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె ముంబైలో పుట్టి పెరిగింది. అంకిత తల్లిదండ్రులు బిజినెస్ రంగంలో ఉంటారు కాబట్టి అందరూ ఆమె బిజినెస్ పై ఆసక్తి చూపిస్తుంది అనుకున్నారట..


కానీ ఎవరూ ఊహించని విధంగా మోడలింగ్ లోకి వచ్చి చిన్న చిన్న యాడ్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమై రస్నా యాడ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈమె లాహిరి లాహిరి లాహిరి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమా కోసం వై.వి.యస్.చౌదరి హీరోయిన్ ని వెతకడానికి ముంబై వెళ్ళినప్పుడు అక్కడ మోడలింగ్ చేస్తున్న అంకిత ఫోటోలు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారట.. ఏంటి రస్నా యాడ్లో చేసిన ఈ పాప ఇంత అందంగా తయారయిందా అంటూ ఆమెకు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ప్రేమలో పావని అనే సినిమాలో కూడా నటించింది. ఇక ఎవరూ ఊహించని విధంగా స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సింహాద్రి అనే సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిందిట.


ఇక ఈ సినిమా వల్ల అంకిత పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. దాంతో అంకితకు ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి. కానీ తన తల పొగురు వల్ల కొన్ని సినిమాలను తానే కావాలని రిజెక్ట్ చేసింది. ఇక ఈమెకు ఉన్న పొగరుతో క్రమక్రమంగా ఛాన్సులు రావడం తగ్గాయి. ఇక అదే నేపథ్యంలో అంకిత చెడు అలవాట్లకు బానిస అయిపోయిందట.డ్రింకింగ్ చేయడం, స్మోకింగ్ వంటి చెడు అలవాట్లకు బానిస అయిపోయింది. ముఖ్యంగా అంకితకు రాత్రి అయితే మూడు పెగ్గులు వేస్తేనే నిద్ర పోవాలనే మూడ్ వస్తుందట. ఇక ఇలా రానురాను అంకిత డిప్రెషన్లోకి వెళ్లి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుందట. ఇక ఈమె కండిషన్ చూసిన అంకిత పేరెంట్స్ చాలా బాధపడి రిహాబిటేషన్ సెంటర్లో కూడా చేర్పించారట. ఇక ఆ తర్వాత ఓ మంచి సంబంధం కూడా చూసి వివాహం జరిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: