మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చి తమకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఇదే ఫ్యామిలీ నుండి మెగా మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ కూడా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకతను అయితే సంపాదించుకున్నారు.
అయితే ఓ విదేశీ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరూ కొన్ని రోజుల నుండి డేటింగ్ లో కూడా ఉన్నారంటూ రూమర్లు కూడా వస్తున్నాయి.
ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు సాయి ధరమ్ తేజ్ తిక్క అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన లారిస్సా బోనేసి. ఈమె తిక్క సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే వీళ్లిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇక ఆ తర్వాత నుండి సాయి ధరమ్ తేజ్ పై ఈమెకు ఉన్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చిందట . అలాగే అక్టోబర్ 15 సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా కూడా లారిస్సా చేసిన ఓ పోస్ట్కి సాయి ధరమ్ తేజ్ పెట్టినా రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిందట.
సాయి ధరమ్ తేజ్ బర్త్ డే రోజు లారిస్సా హ్యాపీ బర్త్ డే మై తేజ్ అంటూ లవ్ సింబల్ తో పోస్ట్ చేసింది. దానికి సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ టు మై డిస్టబెన్స్ అంటూ ఆమెతో కలిసి దిగిన ఒక ఫోటోను నెట్టింట్లో షేర్ చేశాడు. దీనికి లారిస్సా స్పందిస్తూ ఫరెవర్ అంటూ కూడా పోస్ట్పె ట్టింది.ఇక ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు వీరిద్దరూ నిజంగానే ప్రేమలో పడ్డారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా లారిస్సా కూడా సాయి ధరమ్ తేజ్ బర్త్ డే రోజు నేను లవ్ లో పడ్డాను అంటూ పోస్ట్ చేయడం వీరి మధ్య ఏదో ఉంది అనే అనుమానానికి మరింత బలం చేకూర్చినట్టు అయింది. త్వరలోనే వీరి ప్రేమ గురించి మరిన్ని వార్తలు బయట పడనున్నాయి.