ఒకవైపు సినిమాలతో వెండితెరపై అలరిస్తున్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ వంటి షో లతో బుల్లితెరపై ప్రేక్షకులను కూడా అలరిస్తూ ఉన్నారు బాలకృష్ణ. ఆహాలో స్ట్రిమింగ్ అవుతున్న ఈ టాక్ షోకు ఊహించని విధంగా స్పందన లభిస్తోంది. ఇటీవలే ప్రసారమవుతున్న రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్కి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ని గెస్ట్లుగా పిలిపించారు. ఇందుకు టిఆర్పి రేటింగ్ లో హైయెస్ట్ వ్యూస్ వచ్చాయని సమాచారం. కాగా అన్ స్టాపబుల్ షో కు కన్సల్టేషన్ బాధ్యతలని బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని చూసుకుంటున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో పలు పోస్టులు కూడా కనిపిస్తూ ఉంటాయి.


అంతేకాకుండా బాలయ్య స్క్రిప్ట్ వర్క్ కు డేట్లు కాస్ట్యూమ్స్ డిజైనర్ వంటివి కూడా ఆమె చూసుకుంటున్నట్లు సమాచారం. ఇక బాలయ్య అన్ స్టాపబుల్ షో హీట్ కావడంతో బాలయ్య కూతురు కూడా ఇందులో కీలకమైన పాత్ర పోషించిందని తెలియజేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో ఈమె నిర్మాతగా టాలీవుడ్ పరిశ్రమకు పరిచయం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తన తండ్రితో ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు పలు ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఒక పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించే చిత్రమన్నట్లుగా సమాచారం.

ఇక తన సొంత బ్యానర్ పైన సినిమాలు చేయాలని తేజస్విని ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.అయితే ఈ వార్తల పై ఇప్పటివరకు ఎలాంటి విషయం అధికారి కాదు రాలేదు కానీ బాలయ్య కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు. మరొకవైపు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయాన్ని అధికారికంగా ఎవరు ప్రకటించలేదు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ తన 15వ సినిమాకు సంబంధించి షూటింగ్ను పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు దీపావళి పండుగ సందర్భంగా టైటిల్ ని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: