ప్రణీత ఈ ఏడాది జూన్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక తన గారాల పట్టి గురించి తెలుసుకోవాలని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఉన్నారు. అయితే ఇంతలోనే ప్రణీత తన పుట్టినరోజు ఫొటోస్ తో అందరికీ షాక్ ఇచ్చింది. ప్రణీత బ్లాక్ డ్రెస్సులో బ్లాక్ జీన్స్ లో అదిరిపోయే ఫోజులను ఇచ్చింది. ప్రణీత తల్లి అయినా కూడా ఇంకా తన అంద చందాలతో కుర్రకారులను సైతం ఆకట్టుకునేలా కనిపిస్తోంది . ఇప్పటికి సినిమాలను నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఈ ఫోటోతో చెప్పకనే చెబుతోంది ప్రణీత.
అయితే ఎంతోమంది బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత తమ పాత రూపానికి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి అవసరం లేకుండా ప్రణిత కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే ఇలా అందమైన లుక్ లో అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 2021 మే 30న వ్యాపారవేత్త నితిన్ ను వివాహం చేసుకుందు. నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జంట తమ జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశించబోతోంది అనే విషయాన్ని తెలియజేశారు . ప్రణీత చివరిసారిగా 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో హీరోయిన్ గా నటించింది.