పెళ్లైన తరువాత తిరమలకు వెళ్లడం, అక్కడి మాఢ వీధుల్లో నయన్ చెప్పులతో నడవడం, గుడి ముందే రకరకాల ఫోటో షూట్లు చేయడంతో వివాదం రాజుకుంది. చివరకు విఘ్నేశ్ దిగి వచ్చాడు. ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. తాము కావాలని అలా చేయలేదని, భక్తితోనే తిరుమలకు వచ్చామన్నట్టుగా చెబుతూ.. మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించండని కోరాడు. అలా వివాదం సమసిపోయింది.
ఇక ఇప్పుడు ఇంకో వివాదం చుట్టుముట్టుకుంది. తాము తల్లిదండ్రులైమయ్యామని, కవలలు పుట్టారంటూ ఎంతో ఆనందంతో విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఇందులో నయన్, విఘ్నేశ్ ఇద్దరూ కూడా తమ పిల్లల పాదాలను ముద్దాడుతూ మురిసిపోతోన్నట్టు కనిపించారు. మొదట్లో అంతా కూడా నయన్ విఘ్నేశ్ దంపతులకు కంగ్రాట్స్ చెప్పారు.
అయితే అసలు వివాదం తరువాతే మొదలైంది. పెళ్లి జూన్‌లో అయితే.. సెప్టెంబర్‌లోనే పిల్లలు ఎలా పుట్టారు..అంటూ నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. సరోగసి ద్వారా జన్మనిచ్చారని తరువాత వెలుగులోకి రావడంతో అసలు కాంట్రవర్సీ మొదలైంది. ఇక కస్తూరీ శంకర్ వంటి వారు అయితే.. నయన్ పేరు ఎక్కడా చెప్పలేదు కానీ ఆమె వేసిన న్యూస్వై రల్ అయింది.
ఇండియాలో సరోగసీ బ్యాన్ అని, అది చట్టరిత్యా నేరమని చెప్పేసింది కస్తూరీ శంకర్. దీంతో వివాదం మరింత పెద్దదైంది. అయితే తమిళనాడ హెల్త్ మినిస్టర్ సైతం ఈ సరోగసి వివాదం మీద స్పందించాడు. వివరాలు తెలుసుకుంటున్నామని, చట్టవ్యతిరేకంగా చేస్తే శిక్ష తప్పదన్నట్టుగా చెప్పేశాడు. అయితే ఇప్పుడు నయన్ విఘ్నేశ్ ఈ కాంట్రవర్సీ నుంచి తప్పించుకునేందుకు చూస్తున్నారు.
దుబాయ్‌లో సరోగసి ఇల్లీగల్ కాదు. దీంతో దుబాయ్‌లో ఉన్న మహిళతోనే ఈ సరోగసిని కానిచ్చారు. ఆమెకు నయనతార సోదరుడికి మంచి సన్నిహిత సంబంధాలున్నాయట. అందుకే ఆమె ఈ సరోగసికి ఒప్పుకుందని చెప్పించబోతోన్నారట. దీంతో దుబాయ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి హాని ఉండదని, ఇక్కడి ప్రభుత్వాలు కూడా ఇక జోక్యం చేసుకోవని నయన్ విఘ్నేశ్జంట భావిస్తోందట.