ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. వాటిలో ముందుగా బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందించిన ఆది పురుష్ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కృతీసనన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఆ విధంగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా యొక్క టీజర్ ప్రేక్షకులలో మరింత అంచనాలను కలుగజేసింది అని చెప్పాలి.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలయి భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు సినిమాపై అంచనాలను కూడా పెంచింది అని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతం ప్రాజెక్టు కే సినిమాలో షూటింగ్ లో పాల్గొంటున్నాడు ప్రభాస్. ఈ చిత్రాన్ని 2024వ సంవత్సరంలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. వాస్తవానికి 2022లోనే ఈ సినిమా విడుదల కావలసి ఉంది. కానీ కరోనా కారణం వల్ల ఈ సినిమా షూటింగ్ జరగలేదు. అన్ని సినిమాల లాగానే ఈ సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చి ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుంది. ఆ విధంగా 2024వ సంవత్సరంలో ఈ సినిమాను విడుదల చేస్తున్న ప్రభాస్ షారుక్ సినిమా పోటీగా వస్తుండడం జరుగుతుంది.

ఆయన హీరోగా నటిస్తున్న పఠాన్ సినిమాను 2024లో విడుదల చేయాలని భావిస్తూ ఉండడంతో ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య భారీ స్థాయిలో పోటీ తప్పకుండా ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. ఇక సలార్ చిత్రాన్ని 2023వ సంవత్సరంలో విడుదల చేస్తున్నాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మారుతీ దర్శకత్వంలోని సినిమాను కూడా 2023వ సంవత్సరంలోనే విడుదల చేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: