పుష్ప 2 సినిమా రెండవ భాగం పుష్పరాజ్ వర్సెస్ భన్వర్ సింగ్ మధ్య వార్ నేపథ్యంలో రక్తి కట్టించనుంది. ఈ చిత్రం  రెండవ భాగంలో పుష్పరాజ్ వర్సెస్ భన్వర్ సింగ్ షెకావత్ వార్ ని చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. పార్ట్ 2లో అది మరో లెవల్లో ఉంటుందని అంచనా. షూటింగ్ విషయానికి వస్తే..అన్నపూర్ణ స్టూడియోస్ లో బన్నీపై ఫోటోషూట్ జరిగింది. మరోవైపు బ్యాంకాక్- శ్రీలంక అడవుల్లో అరుదైన లొకేషన్లను వెతికేందుకు చిత్రబృందం ప్రయత్నాల్లో ఉందని తెలిసింది. బ్యాంకాక్ అడవుల్లో పులితో బన్ని భీకరమైన ఫైట్ ని చిత్రీకరిస్తారని కూడా లీక్ అందింది. ఇది సీజీలో తెరకెక్కినా కానీ.. రియలిస్టిక్ గా ఉండేందుకు చాలా ఎక్కువ కేర్ తీసుకోనున్నారని సమాచారం తెలిసింది. మొత్తానికి సీక్వెల్ స్టార్టయింది. డిసెంబర్ 2023లో విడదలయ్యేందుకు ఛాన్సుందని టాక్ వినిపిస్తోంది.అయితే పుష్ప 2లో ఒక బాలీవుడ్ నటుడు (అర్జున్ కపూర్) విలన్ గా నటిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి.


అయితే అవన్నీ పుకార్లు మాత్రమేనని ప్రూవ్ అయ్యింది. పుష్ప సీక్వెల్ లో ఫహద్ ఫాసిల్ సిసలైన విలన్. కానీ పుష్ప 2లో అల్లు అర్జున్ ని ఢీకొట్టేందుకు ఒక ప్రముఖ బాలీవుడ్ ఎ-లిస్టర్ చేరేందుకు ఆస్కారం లేకపోలేదని టాక్ వినిపిస్తోంది.పుష్ప: ది రైజ్ లో రష్మిక మందన్న కథానాయికగా అద్భుతంగా నటించి మెప్పించింది. పోలీసు అధికారి భన్వర్ సింగ్ షికావత్ కు పుష్పరాజ్ గుణపాఠం చెప్పడంతో మొదటి భాగం ముగిసింది. ఆ తర్వాత రక్తసిక్తమైన చేతులతో రష్మిక శ్రీవల్లిని పెళ్లి చేసుకున్నాడు.తరువాత ఏం జరిగిందో పుష్ప పార్ట్ 2లో చాలా అద్భుతంగా చూపించబోతున్నారట. ఖచ్చితంగా ప్రతి సీన్ కూడా డైమండ్ లా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. అల్లు అర్జున్ యాక్టింగ్ కి గూస్ బంప్స్ రావడం ఖాయమట.మరి చూడాలి పుష్ప ది రూల్ ఎంత పెద్ద హిట్ అయ్యి జనాలకు గూస్ బంప్స్ తెప్పిస్తుందో అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: