పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు. నూరేళ్ల ప్రయాణం మనం ఎవరితో చేయాలో ఆ దేవుడు ముందే రాసి పెడతాడు. మనం అనుకున్నంత మాత్రాన బంధాలు కలవవు.వద్దనుకున్నంత మాత్రాన వేరు కాలేము. ఇప్పుడు ఈ ఫిలాసఫి ఎందుకు చెబుతున్నానంటే… హీరో మంచు విష్ణు ఓ స్టార్ హీరో అల్లుడు కావాల్సిందట. మోహన్ బాబు తన కొడుకు మంచు విష్ణుకు భార్యగా అనుకున్న అమ్మాయి వేరట. అయితే మంచు విష్ణు తండ్రి చూసిన అమ్మాయిని కాకుండా తనకు నచ్చిన అమ్మాయితో ఏడడుగులు వేశాడట.మంచు విష్ణు 2008లో విరానికా రెడ్డిని వివాహం చేసుకున్నారు. మంచు విష్ణు-విరానిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మంచు విష్ణు ప్రేమ గురించి తెలియని మోహన్ బాబు తనకు అత్యంత సన్నిహితుడు, ప్రాణమిత్రుడు కూతురినిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడట. ఆయన పెద్ద స్టార్ హీరో అట. ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల రీత్యా మంచు విష్ణుకు ఆ హీరో కూతురితో పెళ్లి చేయాలని అనుకున్నారట.

కాగా అప్పటికే మంచు విష్ణు విరానికతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. అదే విషయాన్ని తండ్రి మోహన్ బాబుతో చెప్పాడట. విరానికను ప్రేమించాను, పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను అన్నాడట. దాంతో చేసేది లేక తాను అనుకున్న సంబంధాన్ని పక్కన పెట్టి విరానికతో వివాహం సెట్ చేశాడట. విరానిక కుటుంబం కూడా ఆస్తిలో అంతస్తులో మోహన్ బాబు ఫ్యామిలీకి తగినది కావడంతో మోహన్ బాబు వ్యతిరేకించలేదట.విరానిక ఏపీ సీఎం వైఎస్ జగన్ కి చెల్లెలు వరస అవుతుంది. సీఎం జగన్ కి విరానిక దగ్గర బంధువు. మంచు విష్ణు-విరానికలకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. దాదాపు 14 ఏళ్ళ వైవాహిక ప్రయాణం సాఫీగా సాగుతుంది. మరోవైపు మంచు విష్ణు లేటెస్ట్ మూవీ జిన్నా అక్టోబర్ 21న విడుదల కానుంది. హిట్ ముఖం చూసి ఏళ్ళు గడచిపోగా విష్ణు ఈ చిత్ర విజయంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: