సినిమాల ద్వారా, బుల్లితెర షోల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న జబర్దస్త్ కమెడియన్లలో అభి ఒకరు..అదిరే అభి అనే పేరుతో మరింత పాపులర్ అయ్యారు.. అతను మల్టీ టాలెంట్ అన్న విషయం అందరికి తెలిసిందే..అతను నటించిన సినిమాలలో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న అదిరే అభి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆశించిన స్థాయిలో క్రేజ్ రాకపోవడానికి గల కారణాలను అన్వేషించలేదని ఆయన తెలిపారు.



ఒకటి సొంతంగా క్రియేట్ చేయాలనే ఆలోచనతో మంచి స్కిట్లు చేయాలని నేను భావించానని అదిరే అభి తెలిపారు. కొట్టుకునే స్కిట్లు, అభ్యంతర స్కిట్లు చేయకూడదని నేను అనుకున్నానని అదిరే అభి వెల్లడించారు. అందరూ చూసే స్కిట్లు చేయాలని నేను అనుకున్నానని అదిరే అభి పేర్కొన్నారు. జబర్దస్త్ షోకు నేను ఏదైనా చేయాలనే ఆలోచనతో వెరైటీ స్కిట్లు చేశానని ఆయన వెల్లడించారు. ఈ షోకు సెలబ్రిటీని మొదట తెచ్చింది నేనేనని అదిరే అభి పేర్కొన్నారు. నేను చేసిన స్కిట్లకు సెలబ్రిటీల నుంచి ప్రశంసలు వచ్చాయని అదిరే అభి చెప్పుకొచ్చారు. తోలుబొమ్మ స్కిట్ కోసం బాగా కష్టపడ్దామని అదిరే అభి అన్నారు.



జబర్దస్త్ జోడీల గురించి నేను కామెంట్ చేయనని ఆయన తెలిపారు. నాగబాబు, రోజా గారు ఎప్పుడూ తిట్టలేదని అదిరే అభి అన్నారు.అంతే కాదు రోజా గురించి అభి అన్న మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.రోజాగారిని ఏదైనా సహాయం అడిగితే వెంటనే రెస్పాండ్ అవుతారని నేనొక ఎమ్మెల్యేనని, నేనొక జడ్జి స్థానంలో ఉన్నానని ఆమె అనుకోరని అంత కలిసిపోతారని అదిరే అభి తెలిపారు. రోజా మనస్తత్వం అలా ఉంటుందని అదిరే అభి వెల్లడించారు. అదిరే అభి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదిరే అభి ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తున్నారు...



మరింత సమాచారం తెలుసుకోండి: