పుష్ప మూవీతో బన్నీ జాతీయ స్థాయిగా గుర్తింపు తెచ్చుకోవడం చాలా తృప్తిగా ఉందన్నారు. 'మా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఎక్కువగా సినిమాలు తీసిందని మెగాస్టార్ చిరంజీవి గారే. మా బ్యానర్‌లో ఆయన తీసిన సినిమాలన్ని దాదాపుగా హిట్ అయ్యాయి. ఇక నిర్మాతగా నా జీవితంలో అద్భుతమైన సినిమా తీశాను అనే సంతృప్తి మగధీరతో వచ్చింది. ఈ సినిమాకు మేం పెట్టిన బడ్జెట్ కంటే మూడింతలు లాభం వచ్చింది. మొదట ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే 80 శాతంఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది. దీంతో చాలా భయపడ్డాను. ఇక ఎడిటింగ్, గ్రాఫిక్స్ వర్క్ పూర్తయ్యాక సినిమా చూస్తే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది.
: విడాకులు రద్దు? కొత్త ఇంటికి మారనున్న ధనుశ్-ఐశ్వర్యలు!
వెంటనే డిస్ట్రిబ్యూటర్స్‌కు ఫోన్ చేసి సినిమా మొత్తం మనమే విడుదల చేస్తున్నాం అని చెప్పా. దీంతో వాళ్లంత షాక్ అయ్యారు' అనిచెప్పుకొచ్చారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. చరణ్- బన్ని కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ చేయాలనేదని తన కోరిక అని వారిద్దరి కాంబోలో వచ్చే చిత్రం కోసం చరణ్- అర్జున్ అనే టైటిల్‌ను పదేళ్ల క్రితమే అనుకున్నానని తెలిపారు. అయితే ఈ మల్టిస్టారర్ కోసం కథలు వింటున్నారా అని అడగ్గా.. ఇంకా లేదని సమాధానం ఇచ్చారు. ఎప్పటికైనా తన కల నెరవేర్చుకుంటానని, వీరిద్దరితో కలిసి ఓ సినిమా చేస్తానని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. కాగా ప్రస్తుతం బన్నీ పుష్ప 2తో బిజీగా ఉండగా, చరణ్ శంకర్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.