ఇదంతా పక్కన పెడితే కెరీర్ తొలినాళ్లలో ఎన్టీఆర్ కి ఎదురైనా ఒక చేదు అనుభవం వింటే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురు అవుతాయా అని అనిపించక తప్పదు మరి, ఎందుకు అంటే స్నేహితులను గుడ్డిగా నమ్మితే మోసపోతాం అనే చేదు నిజం ఎన్టీఆర్ జీవితం లో కూడా చోటు చేసుకుంది..అది కూడా సినిమా ఇండస్ట్రీ లోనే..ఇక అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ కెరీర్ లో ఆది సినిమా ఎంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ అనేది మన అందరికి బాగా తెలిసిందే.
ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ కి మాస్ లో విపరీత మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది..కెరీర్ లో ఆ స్థాయి పీక్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కాల్ షీట్స్ కోసం డైరెక్టర్స్ మరియు నిర్మాతలు క్యూ కట్టేవారు అంట మరి, ..పెద్ద పెద్ద సంస్థలు సైతం మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాలు చెయ్యడానికే ఆసక్తి చూపేవారు..అయితే అప్పట్లో ఎన్టీఆర్ కి ఎంతో సన్నిహితుడు గా ఉండే ఒక స్నేహితుడు ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దగ్గర ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి నీకు కాల్ షీట్స్ ఇప్పిస్తాను అని చెప్పి అతని దగ్గర భారీ మొత్తం లో అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట..సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ ఆంధ్ర వాలా ,సాంబ ,నరసింహుడు , నా అల్లుడు ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు కానీ మాకు మాత్రం సినిమా చేసి పెట్టడం లేదు అంటూ నేరుగా ఎన్టీఆర్ వద్దకే వెళ్లారట ఆ నిర్మాతలు.
'మా దగ్గర అంత అడ్వాన్స్ డబ్బులు తీసుకొని మా సినిమా చెయ్యవా..నిన్ను నమ్మి అప్పు చేసి డబ్బు తెచ్చి అడ్వాన్స్ గా నీకు ఇచ్చాము..వాటికి వడ్డీలు కట్టలేక సచ్చిపోతున్నాము..నువ్వు మాత్రం మాకు కాల్ షీట్స్ ఇస్తాను అని చెప్పి మరీ ఇవ్వడం లేదు' అని ఎన్టీఆర్ ని నిలదీసాడు అట.. అప్పుడు ఎన్టీఆర్ ఒక్కసారిగా షాక్ కి గురై నేనెప్పుడూ మీకు కాల్ షీట్స్ ఇచ్చాను అని చెప్పను అని అడిగాడట ఎన్టీఆర్ ని..అప్పుడు ఆ నిర్మాత నీ స్నేహితుడు నీ కాల్ షీట్స్ ఇస్తాను అని చెప్పి మా దగ్గర చాలా డబ్బులు తీసుకున్నాడు.. నువ్వేమో ఏమి తేలినట్టు మాట్లాడుతున్నావ్ అని మండిపడ్డాడు అట ఆ నిర్మాత.. అప్పుడు ఎన్టీఆర్ 'ఈ విషయం నాకు తెలీదు..మీకు కచ్చితంగా నా తదుపరి సినిమాకి డేట్లు ఇస్తాను' అని చెప్పాడట.. ఇలా ఎన్ టి ఆర్ కూడా మోస పోయాడు అంటా.