అల్లు శిరీష్.. అల్లు అరవింద్ కొడుకుగా,బన్నీ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అల్లు శిరీష్.. ఇక ఈయన అల్లు ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ హీరోగా నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు


మొదట్లో తన తండ్రి ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఎన్నో సినిమాలతో ప్రయోగాలు చేసిన అల్లు అర్జున్ గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో అనే సినిమా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారట.. ఇక ఈ సినిమాలో అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటిస్తోంది. మెగా మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ ని హీరోగా విజేత అనే సినిమా ద్వారా పరిచయం చేసిన రాకేష్ శశి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.


ఇక ఈ సినిమా నవంబర్ 4వ తేదీన విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు అన్ని పనులు పూర్తి చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ చేయడంతో అల్లు శిరీష్ సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు శిరీష్ తన బ్రేకప్ గురించి కొన్ని సీక్రెట్ విషయాలు బయట పెట్టారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు శిరీష్. యూట్యూబ్ ఛానల్ యాంకర్ మీ జీవితంలో జరిగిన ఒక బ్రేకప్ గురించి చెప్పండి అని అడిగితే.. నా జీవితంలో బ్రేకప్ కాదు చాలానే బ్రేకప్స్ ఉన్నాయి అని చెప్పుకొచ్చారట.. ఇక ఈ బ్రేకప్ లో రెండు, మూడు బ్రేకప్ లు చాలా వరకు వెళ్లాయి. చాలా క్లోజ్ అయ్యాక మాకు బ్రేకప్ అయ్యింది అంటూ అల్లు శిరీష్ చెప్పారట..


అంతేకాకుండా నేను ఒక పెద్దింటి అమ్మాయిని ప్రేమించి చాలావరకు వెళ్లిపోయాక మా ఇద్దరికీ బ్రేకప్ జరిగింది. ఇక బ్రేకప్ జరగడానికి ముఖ్య కారణం కూడా నేనే అంటూ అల్లు శిరీష్ చెప్పుకొచ్చారు. అయితే ఆ యాంకర్ మీరు ఈ బ్రేకప్ విషయంలో ఎప్పుడైనా బాధ పడ్డారా అని అడిగితే.. నేను ఆ విషయంలో చాలా బాధపడ్డాను. ఒకవేళ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే నాకు కూడా అన్నయ్య లాగే అయాన్,అర్హ ల ఇద్దరు పిల్లలు ఉండేవారు కదా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందట.. అంతే కాదు ఆ అమ్మాయికి అనవసరంగా బ్రేకప్ చెప్పి టైం వేస్టు చేశానేమో అని చాలా సందర్భాల్లో కూడా అనిపించింది అంటూ అల్లు శిరీష్ ఆ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చారు. ఇక అల్లు శిరీష్ చెప్పిన ఆ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: