సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక న్యూడ్ ఫోటోగ్రఫీ ఎక్కువ అయిపోయింది. చిన్న ఏజ్ లోనే చూడకూడని దృశ్యాలు అయితే చూసేస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కువగా న్యూడ్ ఫోటోగ్రఫీకి ఇంట్రెస్ట్ చూపిస్తూ..
మిగతా హీరోయిన్స్ ని కూడా చెడగొట్టేస్తున్నారు . అయితే ఇలాంటి కాలంలో కూడా న్యూడ్ ఫోటోగ్రఫీ అంటే అసహ్యించుకునే హీరోయిన్స్ కూడా ఉన్నారు అని ప్రూవ్ చేసింది అందాల ముద్దుగుమ్మ అతిథి హైదరి.
పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. చాలా తెలుగు సినిమాల్లో కూడా నటించింది . ఆమె లాస్ట్ గా నటించిన తెలుగు సినిమా మహాసముద్రం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది . అయినా తన అంద చందాలతో కుర్రాళ్లను సోషల్ మీడియా వేదికగా అలరిస్తూనే ఉంటుంది. కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతిధి తన గురించి అభిమానులకు తెలియన కొన్ని విషయాలను చెప్పుకొచ్చిందట. ఇదే క్రమంలో తన గురించి తాను తెలుసుకున్న కొన్ని విషయాలను అభిమానులకు చెప్పి షాక్ ఇచ్చింది.
మరి ముఖ్యంగా ఆమె సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తన గురించి జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి గూగుల్ లో తన పేరును టైప్ చేసిందట . ఒక్కసారిగా ఆమె పేరు టైప్ చేయగానే వచ్చిన ఫోటో చూసి షాక్ అయిపోయిందట . తన పేరును గూగుల్లో వేసి సెర్చ్ చేయగానే అతిధికి తన న్యూడ్ ఫోటోలు దర్శనమిచ్చాయట. ఓ సినిమా షూటింగ్ టైంలో అమ్మడు తన వీపు భాగాన్ని ఎక్స్పోజ్ చేసింది. దాన్ని కొందరు ట్రోలర్స్ ఆమె బాడీని మార్ఫ్ చేసి న్యూడ్ ఫోటో గా మార్చి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారట. ఆ విషయం అప్పటివరకు ఆమెకు తెలియదట.' ఫస్ట్ టైం నన్ను నేను అలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో నగ్నంగా చూసుకునేసరికి ఏడుపు వచ్చిందని.. కంపరంగా అనిపించిందని ఇంకొక్కసారి గూగుల్ లో తన పేరును చూసుకోకూడదని డిసైడ్ అయ్యిందట '. అందుకే అప్పటి నుంచి అతిధి ఇంకెప్పుడు గూగుల్ ని వాడలేదట. ఇప్పటికి గూగుల్లో కొందరి టాప్ హీరోయిన్ల పేరు కొడితే పచ్చి న్యూడ్ గా ఫోటోలు కూడా దర్శనమిస్తాయి. సోషల్ మీడియా ద్వారా బాగుపడిన జనాలు ఎంత మందో తెలియదు కానీ సోషల్ మీడియా కారణంగా బాధపడుతున్న జనాలు మాత్రం బోలెడు మంది ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు.